ఐటీఐల్లో నాణ్యతా ప్రమాణాలు, సదుపాయాలపై కేంద్రం దృష్టి
ఐఐటీ, ఎన్‌ఐటీల ఆధ్వర్యంలో తనిఖీలకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లకు ‘నాణ్యత’ పరీక్ష ఎదురు కానుం ది. ఐటీఐల్లో పలుకోర్సు (ట్రేడ్)ల్లో నాణ్యత ప్రమాణాలు, సదుపాయాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇంజనీరింగ్‌కు దిగువ స్థానంలో ఉండే ఐటీఐ కోర్సుల్లో శిక్షణను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఐటీఐల్లో నాణ్యతా ప్రమాణాలపై పక్కా సమాచారం సేకరించేం దుకు త్వరలోనే నాణ్యత ప్రమాణాల తనిఖీ లు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
ఈ తనిఖీ లను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ(ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)ల ఆధ్వర్యంలో చేపట్టేం దుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయం తీసు కున్నట్లు తెలిసింది. ఆ శాఖ నేతృత్వంలోని నేషనల్ కౌన్సిల్ ఆన్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్‌సీవీటీ) సంస్థ ఐటీఐల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి గుర్తింపు ఇస్తోంది. అయితే ఇకపై ఐఐటీలు, ఎన్‌ఐటీలు తనిఖీలు చేయనున్నాయి.
వాటి నివేదికల ఆధారంగా నాణ్యతా ప్రమాణాలు లేని ఐటీఐల గుర్తిం పును రద్దు చేసే ఆలోచనలను నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ చేస్తున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో ఐఐటీ, ఎన్‌ఐటీల తనిఖీ నివేది కల ఆధారంగానే ఐటీఐలకు గుర్తింపును ఇచ్చే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ఐటీఐల శిక్షణలో నాణ్యతా ప్రమాణాలు కొరవడినట్లు ఇప్పటికే ప్రాథమికంగా అంచనాకు వచ్చిన కేంద్రం పూర్తి స్థాయి సమాచారం సేకరణకు సిద్ధమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 వేల ఐటీఐలు ఉన్నాయి. ఇందులో 9 వేల ఐటీఐలు ప్రైవేటు రంగంలో.. 4 వేల ఐటీ ఐలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. వీటిన్నిం టిలో త్వరలో తనిఖీలను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
రాష్ట్ర ఐటీఐల్లో అన్నీ లోపాలే..
తెలంగాణ రాష్ట్రంలో 65 ప్రభుత్వ.. 235 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులు వివిధ ట్రేడ్ (కోర్సులు)ల్లో శిక్షణ పొందుతున్నా రు. రాష్ట్రం లోని ప్రభుత్వ ఐటీఐల్లో పలు లోపా లుండగా.. ప్రైవేటు ఐటీఐల్లో పరిస్థి తి దారుణంగా ఉన్నట్లు అధికారులు చెబు తున్నారు. వసతుల కొరతే కాక మిషనరీ కొరత ప్రైవేటు ఐటీఐల్లో ఉన్నట్లు అధికారు లు అంచనా వేశారు. అధ్యాపకులూ సరి పడా లేకపోవడంతో సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగానే ప్రైవేటు ఐటీఐలు మారా యన్న ఆరోపణలున్నాయి. 65 ప్రభుత్వ ఐటీఐల్లో 20 సంస్థలకు సొంత భవనాలు లేవు. 22 ఐటీఐలకు ప్రిన్సిపాళ్లు లేకపోవ డంతో ఇన్‌చార్జిల పాలనలో కొన సాగు తున్నాయి. ప్రభుత్వ ఐటీఐల్లో 1,964 పోస్టులకు 1,020 మందే పనిచేస్తున్నారు. మిగితావన్నీ ఖాళీనే. ఈ పరిస్థితుల్లో ఐఐటీ, ఎన్‌ఐటీల తనిఖీలే కాదు.. వసతులు, నాణ్యతా ప్రమాణాలను బట్టి గ్రేడింగ్‌లు ఇచ్చేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ సంస్థ నిర్ణయించడంతో ఐటీఐల నిర్వా హకుల్లో ఆందోళన మొదలైంది.
ఐటీఐలకు ‘నాణ్యత’ పరీక్ష..!
Published Fri, Apr 14 2017 3:19 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement