సాక్షి, సంగారెడ్డి: ‘రోడ్లను అద్దంలా తయారు చేయాలని సీఎం కేసీఆర్ చెబుతుంటే.. ఆయన సొంత జిల్లాలోనే ఒక్క రోడ్డు కూడా ప్రారంభించరా..?, ఏం చేస్తున్నారు..?, పక్క జిల్లా నల్గొండలో పనులు పూర్తి కావచ్చాయి.. సీఎం జిల్లా పరువు తీస్తున్నారు..’అంటూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పీఆర్, ఆర్ అండ్‌బీ అధికారులపై మండిపడ్డారు. త్వరలో పనులు పూర్తి చేయండి.. రెండు, మూడు నెలల్లో మళ్లీ వస్తా.. అప్పటికీ పద్ధతి మారకపోతే కఠిన చర్యలు తప్పవం టూ హెచ్చరించారు.
ఆదివారం సంగారెడ్డిలోని కలెక్టరే ట్ సమావేశ మందిరంలో మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ వాటర్‌గ్రిడ్, పీఆర్, ఆర్‌అండ్‌బీ పనులపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పంచాయతీ రాజ్ రోడ్డు పునరుద్ధరణ పనులు, జిల్లాకు కొత్తగా మంజూ రైన రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కాకపోవడం పై ఆ శాఖ అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావడంతో రూ.1,769 కోట్లతో రోడ్లు మంజూరు చేశామన్నారు.
పీఆర్, ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటివరకు రోడ్ల పనులు ప్రారంభించలేని మంత్రి హరీష్‌రావు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించగా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదే విషయమై ఆయన పీఆర్ ఎస్‌ఈ ఆనందంను ప్రశ్నించగా ప్రతిపాదనలు రూపొందిస్తున్న ట్టు చెప్పారు. పొరుగు జిల్లా నల్గొండలో ఇప్పటివరకు నాలుగు ప్యాకేజీలు పూర్తయ్యాయని ఇక్కడ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నారా?, ఇలా పనిచేస్తే ఎలా? అంటూ కేటీఆర్ నిలదీశారు. పీఆర్, ఆర్‌అండ్‌బీ అధికారులు నీళ్లు నములుతూ పనుల ప్రారంభించటంలో జాప్యంపై ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకునే ప్రయత్నం చేశారు.
క్షేత్రస్థాయిలో సిబ్బంది లేరని, ప్రతి పాదనలు పంపినా ఎస్‌ఈ అనుమతులు మంజూరు చేయటం లేదని పీఆర్ ఈఈ వేణుమాదవ్ తెలిపారు. ‘మీ శాఖలోనే ఇన్ని సమస్యలుంటే ఎలా?’ అంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.ఈ విషయమై పీఆర్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణను వివరణ కోరగా ‘సార్ ఈ జిల్లా అధికారుల్లో సోమరితనం ఎక్కువ’ అందుకే పనులు పూర్తికావటంలేదని తెలిపారు. మెదక్ జిల్లాలో అధికారుల వ్యవస్థ బాగోలేదు.. పదిరోజుల్లో సమీక్ష నిర్వహించి పరిస్థితులు చక్కదిద్దండి అని కేటీఆర్ పీఆర్ ఈఎన్‌సీ సత్యనారాయణరెడ్డిని ఆదేశించారు. రోడ్డు పనుల్లో నాణ్యత లేకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అధికారుల తీరుపై మంత్రి హరీష్‌రావు సైతం అసహనం వ్యక్తం చేశారు.
ఏకకాలంలో పనులు చేపట్టండి...
వాటర్‌గ్రిడ్ పనులను ఏకకాలంలో పలుచోట్ల చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని ఆర్ డబ్ల్యూఎస్ ఆధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేసేందుకు నెల వారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచిం చారు. పనులు జరుగుతున్న తీరును మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు సమీక్షిస్తారని చెప్పారు. జిల్లాలో నాలుగు వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు చేపడుతున్నట్టు వివరించారు.
వాటర్‌గ్రిడ్ కోసం 4 టీఎంసీ నీళ్లు, 8 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, రెవెన్యూ, అటవీ, పీఆర్, ఆర్‌అం డ్ బీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సకాలంలో గ్రిడ్ పనులు పూర్తి చేయాలన్నారు. అటవీ, రైల్వే అనుమతులను ముందస్తుగానే పొందాలని సూచించారు. వేసవిలో తా గునీటి ఇబ్బందులు తలెత్తుకుండా చూడాలన్నారు.
గ్రామాలకు కరెంటు కోతలొద్దు..
వేసవి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా గ్రామాల్లో కరెంటు కోతలు విధించ కూడదని మంత్రి కేటీఆర్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. పంచాయతీలు చెల్లించాల్సిన విద్యు త్ బకాయిల విషయంలో డీపీఓ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ లెక్కలు వేర్వేరుగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డీపీఓకు సూచించారు. ఇందిర జలప్రభ కింద మం జూరైన బోర్లకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు.
ఈజీఎస్ పనులను వేగవంతం చేయాలని, అర్హులైన పేదలకు పిం ఛన్లు అందజేయాలని డీఆర్‌డీఏ పీడీకి సూ చించారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, బాబూమోహన్, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్ పాల్గొన్నారు.
పరువు తీస్తారా?
Published Mon, Feb 16 2015 5:46 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Advertisement