water grid works
-
పనుల తీరుపై స్మిత అసహనం
* 100 మంది కూలీలతో పని జరుగుతుందా? * అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు బాల్కొండ : సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులపై ఎందుకింత నిర్లక్ష్యమంటూ సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ అసహనం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనులు మే చివరి నాటికి పూర్తి కావాలని అన్నారు. మంగళవారం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే మండలంలోని జలాల్పూర్ వద్ద నిర్మిస్తున్న మిషన్ భగీరథ పనులను ఆమె పరిశీలించారు. పనులు నత్త నడకన సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికలో 300 మంది కూలీలు పని చేస్తున్నారంటు తెలుపుతున్నారు. కాని ఇక్కడ 100 మంది కూలీలు కూడ పని చేయడం లేదంటూ మండి పడ్డారు. ప్రతి రోజు 300 మంది కూలీలు పని చేయాల్సిన చోట 100 మంది కూలీలతో పని చేస్తే పనులు ఎలా ముందుకు సాగుతాయని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. పనులు సకాలంలో పూర్తి చేయక పోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు క్షేత్ర స్థాయికి విరుద్ధంగా ఎందుకు నివేదికలు అందిస్తున్నారని అని అన్నారు. వాటర్ గ్రిడ్ పనులను త్వరలో మళ్లీ పరిశీలిస్తానన్నారు. పనుల్లో వేగం పుంజు కోకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనులను సంబంధిత అధికారులు ఎందుకు పర్యవేక్షించడం లేదన్నారు. పనులు సాగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్ యోగితా రాణాతో ఆవేదన వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేయాలన్నారు. -
‘నల్లవాగు’కు కొత్త కళ తెస్తాం
- ప్రాజెక్టును ఆధునీకరిస్తాం - చేపల పెంపకం కోసం ఖర్చుకు వెనకాడం - జిల్లాలో రూ. 830 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు - రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కల్హేర్: జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగును పూర్తిగా ఆధునీకరించి దాని స్థితిగతులను మారుస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. సోమవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో నల్లవాగులో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీపాటిల్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.భూపాల్‌రెడ్డితో కలిసి చేప పిల్లలు వదిలారు. అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తామన్నారు. ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందించి 10 రోజుల్లో పూర్తి నివేదిక అందించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీని ఆదేశిస్తామని తెలిపారు. నల్లవాగు వృథా నీటిని డైవర్షన్ చేసి రైతులకు సాగు నీరందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రాజెక్టులు, చెరువుల్లో చేప పిల్లలు పెంచేందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులకు జీవనోపాధి దొరుకుతుందన్నారు. చెరువుల అభివృద్ధి కోసం జిల్లాలో రూ.250 కోట్లు కేటాయించమని తెలిపారు. నారాయణఖేడ్ ప్రాంతంలో కొత్తగా చెరువులు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. జిల్లాలోని మెదక్, జోగిపేట, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో నీటి సమస్య పరిష్కారానికి రూ. 830 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. వాటర్‌గ్రిడ్ ద్వారా నీటి సరఫరా చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సమైక్యాంధ్ర పాలన అవినీతి మయంగా సాగిందని ధ్వజమెత్తారు. గుడిసెలు లేకుండా చేసేందుకు డబుల్బెడ్రూంలు నిర్మించి ఇస్తామన్నారు. ప్రభుత్వాన్ని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, వీరశైవ లింగాయత్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు బీడెకన్నె హన్మంత్, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు నర్సింలు, ఎంపీపీ జమునాబాయి, జెడ్పీటీసీ గుండు స్వప్నమోహన్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు రాంసింగ్, గుండు మోహన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఎంపీటీసీలు ప్రకాశ్, సంజీవరావు, సర్పంచ్ అనురాధ, నాయకులు అంజయ్య, సాయగౌడ్ పాల్గొన్నారు. -
నాలుగు నెలల్లో నీటి కష్టాలకు చెక్!
క్షేత్రగిరి గుట్టపై చురుగ్గా సాగుతున్న వాటర్‌గ్రిడ్ పనులు గోదావరి జలాలతో సస్యశ్యామలం కానున్న శివారు ప్రాంతాలు మేడ్చల్ : తాగునీటి సమస్యతో సతమతమవుతున్న మేడ్చల్ ప్రజలకు మరో నాలుగు దాహార్తి తీరనుంది. ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పనులు చురుగ్గా సాగిస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్టు (హెచ్‌ఎండబ్ల్యుస్) చేపట్టిన సుజల స్రవంతి ప్రాజెక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. కరీంనగర్ నుంచి రాజీవ్ రహదారి వెంబడి పైపులైన్ వేసి మేడ్చల్ మండలం ఘనాపూర్ గ్రామ పరిధిలోని వెంకటేశ్వరస్వామి క్షేత్రగిరి గుట్టపై సంప్, రిజర్వాయర్ నిర్మాణాలను సర్కారు చేపట్టింది. 1500 లక్షల లీటర్ల సంప్, 27 లక్షల లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను ఏడున్నర ఎకరాల్లో నిర్మిస్తున్నారు. నెల రోజుల్లో ట్రయల్ చేయనున్నట్లు సంస్థ ఇంజినీర్లు తెలిపారు. మొత్తం రూ.80 కోట్లవ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఆఖరు దశలో ఉంది. నగరానికి గోదావరి జలాలు. క్షేత్రగిరిపై నిర్మిస్తున్న రిజర్వాయర్ నుంచి రెండు రింగుల ద్వారా హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేయనున్నారు. ఒక రింగు ద్వారా లింగంపల్లి, మరో రింగు ద్వారా మల్కాజిగిరి ప్రాంతాలకు మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట్ మండలాల మీదుగా నీరు సరఫరా చేయనున్నారు. మేడ్చల్‌కు ప్రయోజనమిలా.. క్షేత్రగిరి గుట్టపై నిర్మిస్తున్న వాటర్ గ్రిడ్ పైపులైన్ మేడ్చల్ మీదుగా లింగంపల్లికి వెళుతుం ది. లింగంపల్లికి వెళ్లే పైపులైన్ నుంచి మేడ్చల్ పెద్ద చెరువులోకి గోదావరి జలాలు నింపడం వల్ల మేడ్చల్‌వాసుల నీటి కష్టాలు తీరుతాయి. మేడ్చల్ చెరువును మినీ రిజర్వాయర్‌గా మా ర్చనుండటంతో సాగు, తాగునీటి కష్టాలు తీరనున్నాయి. నాలుగు మండలాలకు నీటి సరఫ రా చేసే విధంగా ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించి వాటి ద్వారా నీటిని సరఫరా చేస్తారు. నాలుగునెలల్లో నీళ్ళందిస్తాం నగరానికి నాలుగు నెలల లోపు నీళ్లందిస్తాం. ప్రాజెక్ట్ నిర్మాణపనులు తుది దశలో ఉన్నాయి. లింగంపల్లి రిం గ్లో 7 కి.మీ., మల్కాజిగిరి రింగ్‌లో 8 కి.మీ. పైపులైన్ వేయాల్సి ఉంది. పనులు ప్రస్తుతం వేగిరం చేశాం. -సతీష్, క్షేత్రగిరి వాటర్‌గ్రిడ్ సైట్ ఇంజినీర్ నాలుగు మండలాలకు నీరందిస్తాం గోదావరి జలాలను నియోజకవర్గంలోని నాలుగు మం డలాలకు సరఫరా చేసే లా నిధులు మంజూరు చేసింది. క్షేత్రగిరి సంప్ నుంచి ఆ యా మండలాలకు వెళ్లే పైపులైన్ ద్వారా నీరు తీసుకుని ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించి గ్రామాలకు నీరు సరఫరా చేస్తాం. -సుధీర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే -
పరువు తీస్తారా?
సాక్షి, సంగారెడ్డి: ‘రోడ్లను అద్దంలా తయారు చేయాలని సీఎం కేసీఆర్ చెబుతుంటే.. ఆయన సొంత జిల్లాలోనే ఒక్క రోడ్డు కూడా ప్రారంభించరా..?, ఏం చేస్తున్నారు..?, పక్క జిల్లా నల్గొండలో పనులు పూర్తి కావచ్చాయి.. సీఎం జిల్లా పరువు తీస్తున్నారు..’అంటూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పీఆర్, ఆర్ అండ్‌బీ అధికారులపై మండిపడ్డారు. త్వరలో పనులు పూర్తి చేయండి.. రెండు, మూడు నెలల్లో మళ్లీ వస్తా.. అప్పటికీ పద్ధతి మారకపోతే కఠిన చర్యలు తప్పవం టూ హెచ్చరించారు. ఆదివారం సంగారెడ్డిలోని కలెక్టరే ట్ సమావేశ మందిరంలో మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ వాటర్‌గ్రిడ్, పీఆర్, ఆర్అండ్బీ పనులపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పంచాయతీ రాజ్ రోడ్డు పునరుద్ధరణ పనులు, జిల్లాకు కొత్తగా మంజూ రైన రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కాకపోవడం పై ఆ శాఖ అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావడంతో రూ.1,769 కోట్లతో రోడ్లు మంజూరు చేశామన్నారు. పీఆర్, ఆర్అండ్బీ అధికారులు ఇప్పటివరకు రోడ్ల పనులు ప్రారంభించలేని మంత్రి హరీష్‌రావు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించగా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదే విషయమై ఆయన పీఆర్ ఎస్ఈ ఆనందంను ప్రశ్నించగా ప్రతిపాదనలు రూపొందిస్తున్న ట్టు చెప్పారు. పొరుగు జిల్లా నల్గొండలో ఇప్పటివరకు నాలుగు ప్యాకేజీలు పూర్తయ్యాయని ఇక్కడ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నారా?, ఇలా పనిచేస్తే ఎలా? అంటూ కేటీఆర్ నిలదీశారు. పీఆర్, ఆర్అండ్బీ అధికారులు నీళ్లు నములుతూ పనుల ప్రారంభించటంలో జాప్యంపై ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకునే ప్రయత్నం చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేరని, ప్రతి పాదనలు పంపినా ఎస్ఈ అనుమతులు మంజూరు చేయటం లేదని పీఆర్ ఈఈ వేణుమాదవ్ తెలిపారు. ‘మీ శాఖలోనే ఇన్ని సమస్యలుంటే ఎలా?’ అంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.ఈ విషయమై పీఆర్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణను వివరణ కోరగా ‘సార్ ఈ జిల్లా అధికారుల్లో సోమరితనం ఎక్కువ’ అందుకే పనులు పూర్తికావటంలేదని తెలిపారు. మెదక్ జిల్లాలో అధికారుల వ్యవస్థ బాగోలేదు.. పదిరోజుల్లో సమీక్ష నిర్వహించి పరిస్థితులు చక్కదిద్దండి అని కేటీఆర్ పీఆర్ ఈఎన్సీ సత్యనారాయణరెడ్డిని ఆదేశించారు. రోడ్డు పనుల్లో నాణ్యత లేకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అధికారుల తీరుపై మంత్రి హరీష్‌రావు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఏకకాలంలో పనులు చేపట్టండి... వాటర్‌గ్రిడ్ పనులను ఏకకాలంలో పలుచోట్ల చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని ఆర్ డబ్ల్యూఎస్ ఆధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేసేందుకు నెల వారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచిం చారు. పనులు జరుగుతున్న తీరును మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు సమీక్షిస్తారని చెప్పారు. జిల్లాలో నాలుగు వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు చేపడుతున్నట్టు వివరించారు. వాటర్‌గ్రిడ్ కోసం 4 టీఎంసీ నీళ్లు, 8 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందన్నారు. ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, అటవీ, పీఆర్, ఆర్అం డ్ బీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సకాలంలో గ్రిడ్ పనులు పూర్తి చేయాలన్నారు. అటవీ, రైల్వే అనుమతులను ముందస్తుగానే పొందాలని సూచించారు. వేసవిలో తా గునీటి ఇబ్బందులు తలెత్తుకుండా చూడాలన్నారు. గ్రామాలకు కరెంటు కోతలొద్దు.. వేసవి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా గ్రామాల్లో కరెంటు కోతలు విధించ కూడదని మంత్రి కేటీఆర్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. పంచాయతీలు చెల్లించాల్సిన విద్యు త్ బకాయిల విషయంలో డీపీఓ, ట్రాన్స్‌కో ఎస్ఈ లెక్కలు వేర్వేరుగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డీపీఓకు సూచించారు. ఇందిర జలప్రభ కింద మం జూరైన బోర్లకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ఈజీఎస్ పనులను వేగవంతం చేయాలని, అర్హులైన పేదలకు పిం ఛన్లు అందజేయాలని డీఆర్డీఏ పీడీకి సూ చించారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, బాబూమోహన్, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్ పాల్గొన్నారు.