సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగం గా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏప్రిల్ ఒకటిన మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచా రం నిర్వహించనున్నారు. రాహుల్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను టీపీసీసీ బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్ 1న మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి జహీరాబాద్ పట్టణంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యా హ్నం 2కి నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానానికి సంబంధించి వనపర్తి, నల్లగొండ లోక్ సభ స్థానానికి సంబంధించి సాయంత్రం 4కి హుజూర్‌నగర్‌లో జరిగే సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు.
ఈవీఎంల మాయ తేలాల్సి ఉంది: ఉత్తమ్
త్రిపురారం: ‘బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరి గితే టీఆర్‌ఎస్ ఓడిపోతుంది, అదే ఈవీఎం లతో ఎన్నికలు జరిగితే మాత్రం టీఆర్‌ఎస్ గెలుస్తుంది.. మరి ఇది ఈవీఎంల మాయనా? మరొ కటా? ఎన్నికల్లో ఏమి జరుగుతోందో.. అది ఎప్పుడూ అనుమానాలకు దారి తీస్తూనే ఉంది’అని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమా వేశంలో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డితో కలసి మాట్లాడారు.
బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారన్నారు. అదే మూడు నెలల క్రితం ఈవీఎంలతో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే జీవన్‌రెడ్డి ఓడిపోయాడన్నారు. ‘అదేమి విచిత్రమో కానీ బ్యాలెట్ పేపర్లు వాడినప్పుడల్లా టీఆర్‌ఎస్ చిత్తుగా ఓడిపోతుంది.. ఈవీఎం మిషన్లు వాడితే మాత్రం టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తోంది’అని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రం లోని పట్టభద్రులు, మేధావులు, టీచర్లు టీఆర్‌ఎస్‌ని తిరస్కరించారన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment