
హైదరాబాద్ : నగరంలో పలు ప్రదేశాలను చిరుజల్లులు పలకరించాయి. ఉదయాన్నే వాతావరణమంతా చల్లబడి పోయి మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. కూకట్‌పల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, తార్నాక, కుషాయిగూడ, కీసర, దమ్మయిగూడ, నాగారం, జవహర్ నగర్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.
వేసవి తాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు, ఈ చిరుజల్లులు కాస్త ఉపశమనాన్ని కలిగించాయి. ఇటీవల ఎండలు మండిపోతుండటంతో, ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి బయపడుతున్నారు. ఈ సమయంలో నగర వాసులకు ఈ చిరుజల్లులు కాస్త ఊరటను ఇస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment