
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకున్నా.. చిరుజల్లులు కూడా పడలేదు. అయితే మంగళవారం సాయంత్రం నగరంలోని ముషీరాబాద్, కోఠి, అబిడ్స్‌లో ఈదురుగాలుతో కూడిన వర్షం పడుతోంది. మలక్‌పేట, చంపాపేట్, సైదాబాద్, సంతోష్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురి, కొత్తపేట, మీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురవగా రోడ్లు జలమయం అయ్యాయి. మరో రెండు రోజులపాటు నగరానికి వర్ష సూచన ఉంది.
కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జైశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో ఉరుములతో కూడిన భారీ వర్షంతోపాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం కూడా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.