నేడు ఈదురు గాలులతో కూడిన వర్షం | rainy, windy expected today | Sakshi
Sakshi News home page

నేడు ఈదురు గాలులతో కూడిన వర్షం

Published Sat, Oct 14 2017 3:00 AM | Last Updated on Tue, Sep 4 2018 4:48 PM

rainy, windy expected today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాలు ఇంకా ఊపందుకుంటున్నాయి. శనివారం ఉరుములు, మెరుపులతో పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దాంతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అన్ని జిల్లాల్లోనూ ఈ పరిస్థితి ఉంటుందని తెలిపింది.

కాగా, గత 24 గంటల్లో సంగారెడ్డిలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పర్వతగిరి, నాగర్‌ కర్నూలు, భీంగల్, శాయంపేట, ఘన్‌పూర్, జఫర్‌ఘడ్‌లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. నారాయణపేట్, మహబూబాబాద్, పెద్దెముల్, బూర్గుంపాడు, సరూర్‌నగర్, సదాశివనగర్, వెంకటాపూర్, ధర్‌పల్లి, భీమదేవరపల్లిలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement