సాక్షి, హైదరాబాద్: అగ్గి తెగులును సమర్థంగా ఎదుర్కోగల కొత్త సాంబా మసూరి వరితో మధుమేహులకు మేలు జరుగుతుందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్) 13 వరి వంగడాలను పరిశీలించి ఈ కొత్త సాంబా మసూరి గ్లైసిమిక్ ఇండెక్స్ (పిండిపదార్థాలు చక్కెరలుగా మారే సూచీ) 50.99గా ఉన్నట్లు తేల్చిం దని తెలిపారు.
అగ్గి తెగులు సోకే అవకాశాలున్న బీపీటీ 5204 లేదా సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా భారతీయ వరి పరిశోధన సంస్థ, సీసీఎంబీలు తొమ్మిదేళ్ల కింద కొత్త సాంబా మసూరి వంగడాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సాంబా మసూరిని దేశంలోనే తొలి సూపర్ వరి వంగడంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పి.ఆనందకుమార్ తెలిపారు.కార్యక్రమంలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు డాక్టర్ విష్ణుప్రియ, డాక్టర్ రమేశ్ శొంఠి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment