ఖురాన్ చదువుతున్న మత గురువు
భూపాలపల్లి అర్బన్: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం కేంద్రంలోని బాంబులగడ్డ సమీపంలోని ఈద్గాలో రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈద్గాలో ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. వేడుకలకు హాజరైన ముస్లింపెద్దలు, మత గురువులు, సోదరులతో ఆయన అలాయ్–బలాయ్ తీసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో మత సామరస్యానికి ప్రతికగా నిలిచే పండుగ రంజాన్ అని, ప్రతీ ఒక్కరూ నియమనిష్టలతో పండుగను జరుపుకోవడం అభినందనీయమన్నారు. కులమతాలకతీతంగా పండుగను హిందూ, ముస్లింలు ఐక్యతతో నిర్వహించుకోవడం మంచి తనానికి నిదర్శనమన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేపట్టి నిత్యం ప్రార్థనలు చేస్తారనిని, కఠినమైన ఈ దీక్ష ముస్లింలకు ఎంతో సహకరిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.
పలువురు హాజరు..
ఈద్గలో జరిగిన వేడుకలకు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు గండ్ర సత్యనారాయణరావు, నాయకులు పాల్గొని నమాజ్ చేశారు. ముస్లిం సోదరులతో అలాయ్–బలాయ్ తీసుకున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు సాంబమూర్తి, బండారి రవి, బుర్ర రమేష్, కుమార్‌రెడ్డి, శేషాల వెంకన్న, ఆకుల మల్లేష్‌గౌడ్, బాబర్‌పాషా, ఖాలిద్, అన్వర్‌పాషా, ఫాజిల్, మసీదు కమిటీ పెద్దలు అబ్ధుల్ ఫాజిల్, షాబీర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment