రేషన్‌కు ఆధార్ లింకు | Ration card link to aadhar card | Sakshi
Sakshi News home page

రేషన్‌కు ఆధార్ లింకు

Published Mon, Jul 14 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

Ration card link to aadhar card

రేషన్ కార్డులకు ఆధార్‌తో పీటముడి పడింది. అదే ఆధారంగా చేసుకొని సర్కారు బోగస్ కార్డుల రద్దుకు సిద్ధమవు తోంది. రేషన్ కార్డులను ఆధార్‌తో సీడింగ్ చేయకుంటే బోగస్‌గా అనుమానించి కార్డులు కత్తిరించేందుకు రంగం సిద్ధమైంది.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో మొత్తం 99.8 శాతం మందికి ఆధార్ గుర్తింపు కార్డులున్నాయి. వీరిలో కేవలం 79 శాతం మంది తమ ఆధార్ కార్డులను రేషన్ కార్డులతో అనుసంధానం(సీడింగ్) చేశారు. దీంతో ఆధార్ లేని కార్డులన్నీ బోగస్‌వేనని అధికారులు అనుమానిస్తున్నారు.
 
 దశలవారీగా సర్వే చేయించి వీటిని రద్దు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కార్డుదారులెవరైనా సరే వెంటనే ఆధార్‌తో సీడింగ్ చేయించుకోవటం తప్పనిసరని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఎక్కడైనా మిగిలిపోయిన వారుంటే తమ ఆధార్ కార్డులను సమీప రేషన్ డీలర్లకు లేదా తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని పిలుపునిచ్చింది.
 
 తాజా పురోగతిని బట్టి ఈ నెలాఖరుకల్లా 85 శాతం సీడింగ్ జరుగుతుందని, మిగతా 15 శాతం యూనిట్లు బోగస్‌వేనని సివిల్ సప్లయిస్ విభాగం అంచనా వేస్తోంది. ఎన్నికల ముందునుంచే జిల్లాలో ఈ రెండు కార్డులను అనుసంధానించే ప్రక్రియ మొదలైంది. ఆధార్ కార్డు లు సమర్పించిన యూనిట్లకే రేషన్ సరుకులు సరఫరా చేస్తామంటూ జిల్లా అధికారులు హడావుడి చేశారు. సీడింగ్ వేగవంతంగా పూర్తి చేయాలంటూ జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తహశీల్దార్లను ఉరుకులు పరుగులు పెట్టించారు.
 
 దీంతో ఇప్పటికే అన్నిచోట్ల కార్డుదారులు తమ ఆధార్ కార్డులను సమర్పించారు. శనివారం నాటికి జిల్లావ్యాప్తంగా 79 శాతం సీడింగ్ పూర్తయింది. 82 నుంచి 85 శాతం సీడింగ్ జరిగినట్లు ఆన్‌లైన్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ మండలాల్లో ఈ ప్ర క్రియ వేగంగానే జరిగిందని, పట్టణ ప్రాంతాల్లోనే స్పందన కనిపించటం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేవలం 56 శాతం, జగిత్యాలలో 52 శాతం, రామగుండంలో 60 శాతం మంది తమ ఆధార్ కార్డులు అందజేశారు. రేషన్‌కార్డులున్న కుటుంబీకులందరూ తమ కార్డులు అందజేయాలని, ఒకవేళ ఆధార్ కార్డులు రాకుంటే ఆధార్ కేంద్రాల్లో నమోదు చేయించుకున్న స్లిప్పులను అందిస్తే సరిపోతుందని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. నెలాఖరు తర్వాత సీడింగ్ లేని కార్డులకు రేషన్ సరుకులు నిలిపేయాలని యోచిస్తోంది. ఆధార్ కార్డులు ఎప్పుడు ఇచ్చినా వెంటనే ఆ కార్డుదారులకు సరుకులను పునరుద్ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే తాత్కాలికంగా సరుకులను ఆపేసి మిగిలిపోయిన కార్డుదారులెవరు.. అసలు వారు ఉన్నారా.. లేదా.. గ్రా మాల వారీగా సర్వే చేయించనుంది. ఒకటికి రెండుసార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వా తే చివరకు మిగిలిన కార్డులను బోగస్‌గా గుర్తించి రద్దు చేయాలని నిర్ణయించింది.
 
 2011 జనాభా గణాంకాల ప్రకారం జిల్లాలో కుటుంబాల సంఖ్యతో పోలిస్తే కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందని ఇప్పటికే తెలిసిపోయింది. దాదాపు 2.30 లక్షల కార్డులు అదనంగా ఉ న్నాయని సివిల్ సప్లయిస్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. తాజాగా ఆధార్ కార్డులతో లింక్ చేయటంతో కార్డులే కాకుం డా.. కుటుంబ సభ్యుల లెక్క కూడా పక్కాగా తేలి పోనుంది. కార్డులతో పాటు యూనిట్ల వా రీగా బోగస్ చిట్టా బయటపడుతుంది. ఆధార్ సీడింగ్ పురోగతి ప్రకారం జిల్లాలో దాదాపు 5.22 లక్షల యూనిట్లు బోగస్‌వని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement