సాక్షి, హైదరాబాద్: టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ)లో భాగంగా భర్తీ చేస్తున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి చాకలి స్వాతి దరఖాస్తును స్వీకరించాలని గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం ఇంటర్‌లో 50 శాతం మార్కులతో పాటు, జిల్లా లేదా రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొన్న వారు సైతం పీఈటీ పోస్టులకు అర్హులని అయితే టీఆర్‌టీలో మాత్రం ఇంటర్‌లో 50 శాతం మార్కులు, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉన్నవారు మాత్రమే అర్హులని చెప్పారని, ఇది సరికాదంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన స్వాతి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జక్కుల శ్రీధర్ వాదనలు వినిపిస్తూ విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్ పోస్టుల కనీస అర్హతలను ఎన్‌సీటీఈ మాత్రమే నిర్ణయించగలదన్నారు. పీఈటీ పోస్టుల భర్తీలో పిటిషనర్ దరఖాస్తును కూడా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment