హైదరాబాద్: ఆర్థికంగా అభివృద్ధి చెందిన రెడ్లు ఇతరులకు సాయం చేయాల్సిన బాధ్యత ఉందని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాగోలు సమీపం లోని జే కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న ‘గ్లోబల్ రెడ్డి కన్వెన్షన్’ రెండో రోజు సదస్సుకు ఆదివారం ఆయన హాజరయ్యారు. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరూ ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారన్నారు.
సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో రాణించాలని మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. యువతకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించి వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించాలన్నారు. కొందరు విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతు న్నారని, అలాంటి వారి పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని చదివించాలని పద్మభూషణ్ అవార్డు గ్రహీత జి.వి.కృష్ణారెడ్డి తెలిపారు.
విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్‌లుగా తీర్చి దిద్దాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజ నేయరెడ్డి సూచించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వర ప్రసాద్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ పైళ్ల మల్లారెడ్డి, హైకోర్టు మాజీ జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి మాట్లా డుతూ... విద్యార్థులు ఆర్థికంగా ఎలా అభి వృద్ధి చెందాలో, యువ పారిశ్రామిక వేత్త లుగా ఎలా రాణించాలో అవగాహన కల్పిం చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రమాకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, మోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు పటోళ్ల కార్తీక్‌రెడ్డి, రెడ్డి జాతీయ ఐక్య వేదిక అధ్య క్షుడు కరుణాకర్‌రెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వసుంధరా రెడ్డి, ధనుంజయరెడ్డి, తరుణ్‌శ్రీరెడ్డి, శేఖర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment