ఆర్థిక ఎమర్జెన్సీని తలపిస్తోంది
మోదీ అసమర్థత, అవగాహనారాహిత్యమే ఇది: ఉత్తమ్
- నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్య
- మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన టీపీసీసీ.. ఉత్తమ్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితులు కనిపిస్తున్నాయని.. దీనికి ప్రధాని మోదీ అసమర్థత, అవగాహనా రాహిత్యమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బం దులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నోట్ల రద్దు అంశంపై కేంద్రం తీరును నిరసిస్తూ ప్రధానిమోదీ దిష్టిబొమ్మలను దహనం చేయా లని టీపీసీసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సోమవారం హైదరా బాద్‌లోని అబిడ్‌స చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసన తెలిపిన కార్య క్రమంలో ఉత్తమ్ పాల్గొని మాట్లాడారు. విదేశాలకు తరలిన నల్లధనం వెలికి తీతలో పూర్తిగా విఫలమైన ప్రధాని మోదీ.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆకస్మికంగా నోట్లను రద్దు చేశారని మండిపడ్డారు. పెద్ద నోట్లు రద్దు చేయడం అవగాహన, బాధ్యత లేకుండా తీసుకున్న పిచ్చి నిర్ణయమని వ్యాఖ్యానిం చారు.
ఇంత జరిగినా ఒక్కపైసా నల్లధనం బయటకు రాలేదేమని ప్రశ్నిం చారు. నల్లధనం వెలికితీతకు తాము వ్యతిరేకం కాదని.. కానీ నల్లధనం వెలికి తీతలో ప్రధాని మోదీ చెప్పిన విష యాలన్నీ అబద్ధాలుగా తేలి పోయాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొ న్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతీ భారతీయుడి బ్యాంకు ఖాతాలో 15 లక్షల చొప్పున వేస్తానని మోదీ హామీ ఇచ్చా రని, ఇప్పటిదాకా ఒక్కపైసా కూడా ఇవ్వలే దేమని ఉత్తమ్ విమర్శించారు. మోదీ అనా లోచిత, అవగాహనలేని తొందరపాటు నిర్ణ యం వల్ల పేద ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం నానా యాతన పడుతున్నారని చెప్పారు.
రోగులు, పెళ్లిళ్లు పెట్టుకున్నవారు, అవసరాల కోసం డబ్బులు జమ చేసు కున్న వాళ్లు తీవ్ర అవస్థలకు గురవుతున్నా రన్నారు. నల్లధనం కూడ బెట్టుకున్న వ్యాపారులు మాత్రం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా హారుుగా ఉన్నారని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు విష యం బీజేపీ, టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులకు ముందుగానే తెలిసి పోరుుందనే అను మానా లు వస్తున్నాయని చెప్పారు. నోట్ల రద్దును ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఉత్తమ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.