సాక్షి, హైదరాబాద్ : తెలుగు స్టార్ మా టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్-3 నిర్వాహకులకి తెలంగాణ హైకోర్టులో స్పల్ప ఊరట లభించింది. తాము చెప్పే వరకు ‘బిగ్‌బాస్’ నిర్వాహకులను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. తమపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ ‘బిగ్‌బాస్’ నిర్వాహకులు మంగళవారం తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ‘బిగ్‌బాస్ 3’ పై బంజారాహిల్స్, రాయదుర్గం పోలీసు స్టేషన్‌లతో నమోదైన కేసులను వెంటనే కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
( చదవండి : ‘బిగ్‌బాస్’ పై మరో వివాదం)
దీనిపై బుధవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. బిగ్‌బాస్ షో నిర్వాహకులుపై నమోదైన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను, పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు బిగ్‌బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
(చదవండి : బిగ్‌బాస్ కార్యక్రమ ప్రతినిధులపై కేసు నమోదు)
Comments
Please login to add a commentAdd a comment