సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. పంచాయతీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఏ విధంగా ఖరారు చేయాలన్న దానిపై జిల్లా కలెక్టర్లు, డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు పంపింది. రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించాల్సిన ఫార్ములాను ఇందులో పొందుపరిచారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే వివిధ స్థాయిల్లోని రిజర్వేషన్లను లెక్కించాలని సూచించింది. ఈ కసరత్తుకు సంబంధించి మరింత స్పష్టత కోసం శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)తో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో డీపీవోలకు ఇచ్చే ఆదేశాలను బట్టి శనివారం జిల్లాస్థాయిలో తదుపరి కసరత్తు చేపట్టవచ్చని తెలుస్తోంది. ఈ నెల 29 నాటికి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. బీసీలకు 23.81%, ఎస్సీలకు 20.46%, ఎస్టీలకు 5.73% చొప్పున రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. వీటికి అనుగుణంగా పంచాయతీలను కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నారు. 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. బీసీ రిజర్వేషన్లను ఓటర్ల జాబితాలకు అనుగుణంగా నిర్ధారిస్తారు. ఇందులో భాగంగా అన్ని కేటగిరిల్లోనూ మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయిస్తారు.
నాన్–షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు
సర్పంచ్‌ల విషయంలో మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారు. వార్డు సభ్యులకు సంబంధించి గ్రామపంచాయతీలను యూనిట్‌గా తీసుకుంటారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామపంచాయతీలను, 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామపంచాయతీలను మినహాయించి రిజర్వేషన్లను ఖరారు చేస్తారు.
100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామపంచాయతీల్లో...
అన్ని సర్పంచ్ స్థానాలను ఎస్టీలకేకేటాయిస్తారు. అన్ని వార్డులనుఎస్టీలతోనే భర్తీ చేస్తారు. ప్రతి కేటగిరీలో మహిళలకు 50 శాతం రిజర్వ్ చేస్తారు.
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో...
షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని అన్ని సర్పంచ్ స్థానాలను ఎస్టీలకే కేటాయిస్తారు వార్డు సభ్యుల విషయంలో సంబంధిత గ్రామపంచాయతీల్లోని వివిధ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయిస్తారు. అయితే మొత్తం సీట్లలో ఎస్టీల రిజర్వేషన్లు 50 శాతానికి తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
బీసీలకు సంబంధించి...
2018 రాష్ట్ర పంచాయతీరాజ్‌చట్టం ప్రకారంబీసీ సర్పం చ్ స్థానాలు ఖరారు చేసి ఒక్కో జిల్లాకు కేటాయిస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో 50 శాతంఆయా వర్గాలకు చెందిన మహిళలకు పంచాయతీరాజ్ కమిషనర్‌కేటాయిస్తారు. మిగిలిన 50 శాతం రిజర్వ్ చేయని స్థానాలను ఒక్కో జిల్లాకు కేటాయించి, దానిని జిల్లా కలెక్టర్‌కు పంపిస్తారు.
సర్పంచ్ స్థానాల నిర్ధారణ..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీలవారీగా ఎన్ని సర్పంచ్ స్థానాలను రిజర్వ్ చేస్తారన్నది కమిషనర్ తెలియజేస్తారు దీనిపై జిల్లా కలెక్టర్ మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఒక్కో కేటగిరీకి వచ్చే రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. సంబంధిత జిల్లాలోని మొత్తం ఎస్టీ,ఎస్సీల జనాభాకు అనుగుణంగా మండల స్థాయిల్లో ఎస్టీ, ఎస్సీలకు సర్పంచ్ స్థానాలు కేటాయిస్తారు. షెడ్యూల్డ్ ఏరియాల పరిధిలోని గ్రామాలతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారం వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న అన్ని సర్పంచ్ స్థానాలను ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేస్తారు.
వార్డులపై ఎంపీడీవోలు...
ఎంపీడీవో ముందుగా మండలంలోని వార్డుల్లో మిగతా మొత్తం ఓటర్ల కంటే ఎస్టీ ఓటర్ల నిష్పత్తి ఎక్కువగా ఉందో వాటిని ఎస్టీలకు అపసవ్యదిశలో (ఎక్కువ నుంచి తక్కువకు) రిజర్వ్ చేస్తారు. ఎస్టీలకు రిజర్వ్ చేశాక, వాటిని మినహాయించి మండలంలోని వార్డుల్లో మొత్తం ఓటర్ల కంటే ఎస్సీ ఓట్ల నిష్పత్తి ఎక్కువగా ఉన్నవాటిని ఎస్సీలకు అపసవ్యదిశలో (ఎక్కువ నుంచి తక్కువకు) రిజర్వ్ చేస్తారు. ఎస్టీ, ఎస్సీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాక మిగిలిన వార్డుల్లో మొత్తం ఓటర్ల కంటే బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న వాటిని ఎక్కువ నుంచి తక్కువకు కేటాయిస్తారు. పంచాయతీల్లోని వార్డులను డ్రా ద్వారా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, అన్ రిజర్వ్‌డ్ కేటగిరీల్లోని మహిళలకు రిజర్వ్ చేస్తారు. నవంబర్ 11 నాటికి ప్రచురించిన ఓటర్ల జాబితాకు అనుగుణంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ ఓటర్ల నిష్పత్తిని ఖరారు చేస్తారు.జిల్లా కలెక్టర్ల నుంచి ఆర్డీవోలకు... రిజర్వేషన్ల ఖరారు తర్వాత జిల్లా కలెక్టర్లు సంబంధిత ఆర్డీవోలకు వీటిపై సమాచారాన్ని పంపిస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వ్ చేసిన పంచాయతీలు, రిజర్వ్ చేయని పంచాయతీస్థానాల వివరాలను ఆర్డీవోకు కలెక్టర్ తెలియజేస్తారు. దీనికి అనుగుణంగా ఆర్డీవో ప్రతి మండల ప్రజాపరిషత్‌లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వ్ చేసిన పంచాయతీస్థానాలతోపాటు అన్ రిజర్వ్‌డ్ సర్పంచ్ స్థానాలను కేటాయిస్తారు
Comments
Please login to add a commentAdd a comment