హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపడతామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారని హరీశ్ తెలిపారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి మిషన్ కాకతీయ పేరును ఖరారు చేశామని, రెండు వారాల్లో టెండర్లకు పిలుస్తామన్నారు. నీటిపారుదల, చెరువులు, తాగునీటికే అధిక ప్రాధ్యాన్యమిస్తూ రాష్ర్ట తొలి బడ్జెట్‌ను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించింది. నిధుల విడుదలలో ఎంత చొరవ చూపారో, వాటి వినియోగంలో కూడా అంతే చొరవ తీసుకుంటే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.