రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సీఎం సమీక్ష
హైదరాబాద్: జూన్ 2 నుంచి నిర్వహించనున్న రాష్ట్రావతరణ వేడుకలకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంకోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు తెలంగాణ ఆవిర్బావ వేడుకల్లో నివాళులు అర్పించాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు.
అనంతరం ప్రతిరోజు ఒక కొత్త పధకాన్ని ప్రారంభింనున్నారు. జూన్ 3న గర్భీణీలకు ఆసరగా నిలిచే కేసీఆర్ కిట్ పధకాన్ని ప్రారంభించనున్నారు. జూన్4న ఒంటరి మహిళలకు భృతినిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో రాష్ట్రంకోసం ప్రాణాలర్పించిన అమరవీరుల శాశ్వత స్తూపాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.