గుట్టుగా కొల్లగొట్టు | Rob Hill | Sakshi
Sakshi News home page

గుట్టుగా కొల్లగొట్టు

Published Tue, Nov 11 2014 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

Rob Hill

మానవపాడు: మండలంలోని తుంగభద్ర నదీతీర ప్రాంతం నుంచి ఇసుక గుట్టుగా తరలిపోతోంది. ఇసుకాసురులు రాత్రివేళల్లో కర్నూలుకు చెందిన వే బిల్లులతో అక్రమమార్గం లో హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం మాత్రం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో అలంపూర్ ఎ మ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ కర్నూలు నుంచి వచ్చిన ఏడు ఇ సుకలారీలను నిలిపి మానవపాడు స్టేషన్‌కు తరలించారు.

సరిహద్దు చెక్‌పోస్టు ఉన్నా ఫలితం శూన్యమని, కమీషన్ల మత్తులో లారీలను వదిలేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. జిల్లా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఎమ్మెల్యే హల్‌చల్ సృష్టించి ఇసుక లారీలను అడ్డుకోవడంతో అలంపూర్ చౌరస్తా నుండి పుల్లూర్ టోల్‌ప్లాజా వరకు ఇసుకలోడుతో ఉన్న వాహనాలు నిలిచిపోయాయి.

డబ్బులు చెల్లించి సీమాంధ్ర వే బిల్లులు తీసుకున్న వాహనాలను వదలకపోవడంతో ముందుకు పోలేక రోడ్లపైనా నిలిపిఉంచారు. ఓ వైపు సీమాంధ్ర నేతలు వే బిల్లులు ఉన్నాయని, ఆ వాహనాలను వదిలేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వాహనాలను వెళ్లనిచ్చేది లేదని హెచ్చరించారు.

 మాకెందుకులే..!
 తమకెందుకే అనుకున్నారేమో గాని రెవెన్యూ, పోలీసు అధికారులు రోజుకు వందల సంఖ్యలో ఇసుకలారీలు తరలిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ వాహనా ల దగ్గర వే బిల్లులు ఉన్నాయా.. లేదా? అని కూడా తని ఖీలు చేయడం లేదు. అక్రమంగా ఇసుకను తరలించే వారు అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకుని యథేచ్ఛగా ఇసుకవ్యాపారం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement