మహబూబాబాద్‌లో దొంగల బీభత్సం
Published Fri, Jun 23 2017 11:32 AM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM
మహబూబాబాద్: మహబూబాబాద్‌లోని ఎటిగడ్డ తండాలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తండాలోని చాంప్లా ఆర్ముఖం అనే వ్యక్తిపై దాడి చేసి రూ.1.70 లక్షల నగదు, 12 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు లాక్కెళ్లారు.
ఈ దాడిలో ఆర్ముఖం తీవ్రంగా గాయపడటంతో వైద్య నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement