మానుకోటలో చోరీ
-
రూ.10 వేలతో పాటు 1.40 లక్షల విలువైన వస్తువుల అపహరణ
మహబూబాబాద్ : పట్టణంలోని మార్వాడి సత్రం వె నుకబజారుకు చెందిన గుగులతో మోతీలాల్ ఇంట్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. బాధితుల కథ నం ప్రకారం.. మోతీలాల్–పార్వతి దంపతులు పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటన్నారు. పార్వతి ఇండియన్ బ్యాంక్‌లో క్యాషియర్ కాగా, మోతీలాల్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. మోతీలాల్ తల్లిదండ్రులు బిచ్యా, లక్ష్మి కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. మంగళవారం వా రంతా ఇంట్లోనే ఉన్నారు. బిచ్యాకు చుట్ట(పొగ) తాగే అలవాటు ఉండడంతో రాత్రి వేళలో పలుమార్లు లేచి బయటకు వెళ్తుంటాడు. దీంతో ముందు గది తలుపులు దగ్గరకు వేసి అందరూ నిద్రించారు. ఇదే అదనుగా భావించిన దొంగలు మంగళవారం రాత్రి ఇం ట్లోకి చొరబడి మధ్య గది టేబుల్‌పై ఉన్న బ్యాగ్ ఎత్తుకెళ్లారు. అందులో రెండు సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్, రెండు తులాల బంగారు ఆభరణాలు, మూడు తులా ల వెండి పట్టీలు, రూ.10 వేల నగదు ఉన్నాయని బా ధితులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు మోతీలాల్ కుమారుడు లేచి ఏడుస్తుండడంతో బ్యాగ్ లో ఉన్న జెండూబామ్ కోసం చూడగా, బ్యాగ్ కని పించలేదు. చోరీ జరిగిందని తెలుసుకున్న పార్వతి అరుపులు, కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారంతా అక్కడికి చేరుకుని వెదకగా, బ్యాగ్‌ను కాల నీలోనే పడేసి, అందులో ఉన్న నగలు, నగదు తీసుకెళ్లారు. ట్రాఫిక్ ఎస్సై అంబటి రవీందర్‌కు సమాచా రం ఇవ్వడంతో అంతటా వెదికినా ఫలితం లేదు. బు ధవారం ఉద యం ఎస్సై ప్రసాద్‌రావు ఆ ఇంటికి చే రుకొని చోరీకి సంబంధించిన వివరాలు సేకరించా రు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.