మనురు (మెదక్) : మెదక్ జిల్లా మనురు మండలంలోని నల్లపోచమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
మండలంలోని బోరించ గ్రామంలోని నల్లపోచమ్మ ఆలయంలోకి చొరబడిన దుండగులు 3.5 కేజీల వెండి ఆభరణాలు, 4 హుండీలు ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నల్లపోచమ్మ ఆలయంలో చోరీ
Published Sun, Aug 16 2015 8:56 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement