హైదరాబాద్: తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే సమ్మక్క- సారలమ్మ జాతర ఏర్పాట్లకు గురువారం తెలంగాణ ప్రభుత్వం రూ.101 కోట్లు విడుదల చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈనెల 13న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భేటీ కానున్నారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించే సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, శాంతి భద్రతల పై అధికారులతో సీఎం చర్చించనున్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నతాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2013 ఏప్రిల్ నుంచి పెరిగిన ధరల ప్రకారం కాంట్రాక్టర్లకు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు.