కలెక్టరేట్ : 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.3,630.44 కోట్లతో జేసీ లక్ష్మీకాంతం వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, అధికారులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 26వ వార్షిక రుణ ప్రణాళిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వివిధ బ్యాంకు అధికారులు రైతులకు పంటరుణాలు, ప్రభుత్వ రాయితీలు సకాలంలో అందించాలన్నారు.
రైతులను ఏమాత్రం ఇబ్బందులకు గురి చేయకూడదని, జిల్లాలోని బంగారు తల్లి, జననీ సురక్ష యోజన పథకం లబ్ధిదారులకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవడాలని సూచించారు. గతేడాది నిర్ధేశించిన లక్ష్యాలను బ్యాంకు అధికారులు పూర్తిగా సాధించలేదని, ఈ ఏడాదిలో వంద శాతం సాధించి రైతులకు లబ్ధి చేకూర్చాలన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీహెచ్ లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రూ.3,630.44 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ప్రియారిటీ కింద రూ.3,205.64 కోట్లు, నాన్ ప్రియారిటీ కింద రూ.424.80 కోట్లు చొప్పున ప్రణాళికలు తయారు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో రైతులను ఇబ్బందులు పెట్టకుండా రుణ అర్హత కార్డు ఉన్న వారిని గుర్తించి ఆ రైతులకు రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా బ్యాంకు అధికారులను, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, ఎస్సీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల, రాజీవ్ యువశక్తిపై గతేడాదిలో సాధించిన ఫలితాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో లీడ్‌బ్యాంక్ మేనేజర్ శర్మ, ఆర్‌బీఐ ఆర్‌వోజే పుల్లారెడ్డి, నాబార్డ్ మేనేజర్ రవి, బ్యాంకు అధికారులు మహ్మద్‌ఖాన్, దక్షిణేశ్వర్, వినయ్‌కుమార్, రాజేందర్, జేడీఏ రోజ్‌లీల, స్టేప్ సీఈవో వెంకటేశ్వర్లు, బీసీ కార్పోరేషన్ ఈడీ నారాయణరావు, మైనార్టీ సంక్షేమ శాఖ ఈడీ శాస్త్రీ, అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
రూ.3,630 కోట్లు వార్షిక రుణ ప్రణాళిక
Published Thu, Jul 10 2014 2:11 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM
Advertisement