గ్రేహౌండ్స్ పటిష్ఠతకు రూ. 4 కోట్లు!
గ్రేహౌండ్స్ పటిష్ఠత, మావోయిస్టుల చర్యలను నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 4 కోట్లు కేటాయించింది. లోయర్ పెన్గంగ ప్రాజెక్టు కోసం రూ. 2.86 కోట్లు కేటాయించారు. ఐటీ సెజ్లలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, విద్యుత్ తదితర అవసరాల కోసం రూ. 3.44 కోట్లు కూడా కేటాయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
శ్రీశైలం జల వివాదంపై బుధవారం కృష్ణాబోర్డు సమావేశం ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు వసతులను మెరుగుపరచడానికి సివిల్, పోలీసు ఉన్నతాధికారులతో ఓ సమన్వయ కమిటీని నియమించారు. ఇందులో 12 మంది సభ్యులుంటారు.