బంజారాహిల్స్ : ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయిన విషయం గమనించిన డ్రైవర్ అప్రమత్తమై.. సమయస్ఫూర్తితో వ్యవహరించటంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీ 28 జెడ్ 164 బస్సు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్‌కు 40 మంది ప్రయాణీకులతో వెళ్తుండగా వెంకటగిరి డౌన్‌లో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
ఒక్కసారిగా బస్సు వెనక్కి వెళ్తుండటంతో భయంతో హాహాకారాలు చేస్తూ ప్రయాణీకులు కొందరు కిందకు దూకారు. డ్రైవర్ శైలేందర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును ఫుట్‌పాత్‌పైకి ఎక్కించడంతో బస్సు ఆగిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్
Published Thu, Oct 8 2015 8:03 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM
Advertisement
Advertisement