Brakes fail
-
తార్నాకలో ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం తార్నాకలో బీభత్సం సృష్టించింది. డ్రైవర్.. బస్సును అదుపు చేయలేక.. ముందున్న వాహనాలను ఢీ కొట్టాడు. దీంతో.. మూడు కార్లు, ఓ బైక్ ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన జరిగిన వెంటనే తాత్కాలిక డ్రైవర్ పారిపోయారు. జేబీఎస్ నుంచి జనగామ వెళుతుండగా హబ్సీగూడ సిగ్నల్స్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. గోతిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్‌రోడ్డు వద్ద భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా రోడ్డుపక్కనున్న గోతిలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 13మంది ప్రయాణికులు గాయపడ్డారు. మరోవైపు సత్తుపల్లి డిపోకు చెందిన బస్సు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. కాగా తాత్కాలిక డ్రైవర్లకు సరైన అనుభవం లేకపోవడంతో ఇప్పటికే పలుచోట్ల ప్రమాదాలు జరిగాయి. 24వ రోజుకు చేరిన సమ్మె కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం మొండి వైఖరి వీడేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. సీఎం కేసీఆర్ కార్మికుల సమస్యల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని వారు హితవు పలికారు. ఈనెల 30న సరూర్‌నగర్ నగర్లో సకలజనుల సమరభేరి సభను నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. -
లారీ బీభత్సం
బ్రేక్‌లు ఫెయిలై ఆగి ఉన్న కార్లు, బస్సును ఢీకొన్న వైనం రెండు కార్లు నుజ్జునుజ్జు తప్పిన పెను ప్రమాదం లంకెలపాలెం కూడలిలో ఘటన అగనంపూడి : నిత్యం రద్దీగా ఉండే లంకెలపాలెం కూడలిలో బ్రేకులు ఫెయిలై ఓ లారీ బీభత్సం సృష్టించింది. భయానక వాతావరణాన్ని కల్పించింది. సంఘటన తీరు చూసిన వారికి పెద్ద ఘోర కలి జరిగే ఉంటుందని భావించినా, పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధి లంకెలపాలెం కూడలిలో ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖనగరానికి చెందిన నాగేశ్వరరావు, చక్రధర్, శరత్‌కుమార్‌లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం మూడు కార్లలో తలుపులమ్మలోవకు బయలుదేరారు. ఉదయం 8.30 గంటలకు లంకెలపాలెం కూడలిలో సిగ్నల్ లైట్లు పడడంతో మూడు కార్లు వరుసగా ఆగాయి. పక్కనే శివాజీపాలేనికి చెందిన వెంకటస్వామి అనకాపల్లి వెళ్లడానికి భార్య సత్యవేణితో కలిసి మరో కారులో ప్రయాణిస్తూ మూడు కార్ల పక్కనే ఆగారు. దాని వెనక ఫార్మాసిటీ రోడ్డులోకి మలుపు తిరగడానికి మైలాన్ కంపెనీ ఉద్యోగుల బస్సు నిలిచింది. ఇంతలో గాజువాక వైపు నుంచి వెనకగా వచ్చిన లారీ బ్రేక్‌లు ఫెయిల్ అవ్వడంతో ముందు ఆగిన కారును ఢీకొంది. అక్కడితో ఆగకుండా మరో మూడు కార్లను, ఫార్మా కంపెనీ బస్సును ఢీకొంది. + ఇదే సమయంలో కూడలిలోని బ్యాకరీలో పనిచేస్తున్న కె.విష్ణు(19) రోడ్డు దాటుతుండగా, రెండు కార్ల మధ్యలో ఇరుక్కోవడంతో ఎడమ కాలు విరిగిపోయింది. ఈ సంఘటనలో శివాజీనగర్‌కు చెందిన వెంకటస్వామి, సత్యవేణి, మరో రెండు కార్లలోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, నాగేశ్వరరావు, చక్రధర్, శరత్‌కుమార్, సత్యవతి, సౌజన్యలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి 108 సర్వీసులో ఇంటికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో రెండు కార్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. దీంతో లంకెలపాలెం కూడలిలో సుమారు గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, ప్రమాదానికి గురైన కార్లను అక్కడ్నుంచి తొలగించారు. -
తృటిలో తప్పిన పెనుప్రమాదం
కుప్పం: చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును అదుపు చేయడంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన కుప్పం మండలం మల్లనూరు గ్రామం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 42 మంది ప్రయాణికులతో మల్లనూరు నుంచి కుప్పం వెళ్తుండగా.. ఒక్కసారిగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లి నిలిపివేయడంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్
బంజారాహిల్స్ : ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయిన విషయం గమనించిన డ్రైవర్ అప్రమత్తమై.. సమయస్ఫూర్తితో వ్యవహరించటంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీ 28 జెడ్ 164 బస్సు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్‌కు 40 మంది ప్రయాణీకులతో వెళ్తుండగా వెంకటగిరి డౌన్లో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఒక్కసారిగా బస్సు వెనక్కి వెళ్తుండటంతో భయంతో హాహాకారాలు చేస్తూ ప్రయాణీకులు కొందరు కిందకు దూకారు. డ్రైవర్ శైలేందర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును ఫుట్‌పాత్‌పైకి ఎక్కించడంతో బస్సు ఆగిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు బ్రేకులు ఫెయిల్ : నలుగురికి గాయాలు
ఆదిలాబాద్ (ఖానాపూర్) : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. బస్టాండ్‌లో బస్సును పార్క్ చేస్తుండగా బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో బస్సు అదుపు తప్పడంతో నలుగురు గాయపడ్డారు. కోపోద్రిక్తులైన స్థానికులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం నిర్మల్‌కు తరలించారు. -
లారీ బ్రేకులు ఫెయిల్..డ్రైవర్ మృతి
కర్నూలు: లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని తప్పించడానికి ప్రయత్నించిన లారీ డ్రైవర్ అదే లారీ కింద పడి మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం గొర్లగుట్ట మలుపులో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి పొద్దుటూరు వెళ్తున్న లారీ గొర్లగుట్ట మలుపు వద్ద బ్రేకులు చేడిపోయాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుందామని ప్రయత్నించాడు. కాని ప్రమాదవశాత్తూ లారీ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామానికి చెందిన పెద్దయ్య(42)గా గుర్తించారు. ఘటన సమయంలో లారీలో ఉన్న క్లీనర్ సహా మరో ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.