తృటిలో తప్పిన పెనుప్రమాదం | RTC bus driver good reaction over brakes fail | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన పెనుప్రమాదం

Published Sun, Dec 27 2015 2:43 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

RTC bus driver good reaction over brakes fail

కుప్పం: చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును అదుపు చేయడంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన కుప్పం మండలం మల్లనూరు గ్రామం వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 42 మంది ప్రయాణికులతో మల్లనూరు నుంచి కుప్పం వెళ్తుండగా.. ఒక్కసారిగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లి నిలిపివేయడంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement