
బోధన్ మండలం పెగడపల్లిలో రైతులకు బీమా బాండ్లను అందిస్తున్న డీఏవో గోవింద్
మోర్తాడ్(బాల్కొండ) : రైతుబంధు పథకం అమలులో భాగంగా రైతులకు ప్రభుత్వం జీవిత బీమా సంస్థ ద్వారా రూ.5 లక్షల విలువ చేసే బీమా బాండ్ల జారీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో కొంతమంది రైతులకు వ్యవసాయ అధికారి గోవింద్ లాంఛనం గా సోమవారం బాండ్‌లను అందివ్వగా, మంగళవారం నుంచి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పంపణీ చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 1,45,000 మంది రైతులు బీమా బాండ్లకు అర్హత సాధించారు.
అయితే ఆధార్ కార్డులు సమర్పించిన రైతులకే బాండ్‌లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు మొదటి విడతలో 97,238 మంది రైతులకు బాండ్లను ఈనెల 13 వరకు ఇవ్వనున్నారు. ఒక్కో రైతు పేరిట రాష్ట్ర ప్రభుత్వమే రూ.2,791 ప్రీమియం జీవిత బీమా సంస్థకు చెల్లించింది. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం పొం దిన రైతులకు బీమా వర్తించే విధంగా ప్ర భుత్వం చర్యలు తీసుకుంది. 18 ఏళ్ల నుం చి 59 ఏళ్ల వయస్సు లోపు వారికి బీమా ప్రయోజనాలను వర్తించే విధంగా ప్రభు త్వం నిర్దేశించింది.
పెట్టుబడి సహాయం అనేక మంది రైతులు పొందినా బీమాకు సంబంధించి వయస్సును పరిగణనలోకి తీసుకోవడం తో కొందరికే బీమా బాండ్లు జారీ కానున్నాయి. ఇప్పటికే ఏ గ్రామంలో ఏ రోజు బాండ్లను ఇవ్వనున్నారో వ్యవసాయ శాఖ అధికారులు షెడ్యూల్‌ను ఖ రారు చేశారు. బాండ్లను జారీ చేసే గ్రా మంలో ఒక రోజు ముందుగానే దండోరా వేయించనున్నా రు. పెట్టుబడి సహాయం చెక్కులను పంపిణీ చేసిన విధంగానే బీ మా బాండ్ల జారీ కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండో విడతలో
రెండో విడతలో ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది రైతులకు బాండ్లు పంపిణీ చేయనున్నామని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ తెలిపారు. రెండో విడతకు సంబంధించిన బాండ్లు కూడా త్వరలోనే జిల్లాకు చేరనున్నాయని ఆయ న వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment