కనీసవేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నంగనూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు సఫాయి కార్మికులు దర్నా నిర్వహించారు.
మెదక్(నంగునూరు): కనీసవేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నంగనూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు సఫాయి కార్మికులు దర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయూ డివిజన్ ఉపాద్యాక్షురాలు బండోజు హేమలత మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సపాయి కార్మికులు అరకొర వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నారన్నారు.
సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ ప్రభాకర్‌కు అందజేశారు. కార్యక్రమంలో కావాటి యాదగిరి, బాల్‌నర్సయ్య, దేవవ్వ, మీనవ్వ, బలరాం, లక్ష్మి, నర్సింలు పాల్గోన్నారు.