
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్.. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది మాట్లాడే భాష. 53 దేశాల్లో అధికారిక భాష.. నేటి టెక్నాలజీ యుగంలో మన దైనందిన జీవితానికి అత్యవసరమైన ఇంటర్నెట్ భాష కూడా ఇదే. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఏవియేషన్, టూరిజం, మెడిసిన్.. ఇలా ఏ సబ్జెక్టు నేర్చుకోవాలన్నా, ఏ రంగంలో అవకాశాలు అందుకోవాలన్నా, కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగలగడం తప్పనిసరి.
అంత ప్రాధాన్యమున్న ఇంగ్లిష్‌లో మీరు ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా శిక్షణ ఇచ్చేందుకు ‘సాక్షి ఎడ్జ్’ముందుకు వచ్చింది. స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణలో విశేష అనుభవమున్న ‘సాక్షి ఎడ్జ్’నిపుణుల వినూత్న బోధన ద్వారా మీరు తక్కువ సమయంలోనే ఆ భాషపై పట్టు సాధించొచ్చు. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాగంగా.. స్పీకింగ్, లిజనింగ్ స్కిల్స్, ఉచ్ఛారణ, మాట్లాడటంలో దొర్లే తప్పులను సరిదిద్దడంతోపాటు గ్రామర్‌పైనా అవగాహన కలిగిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన కోర్సు మెటీరియల్‌ను, కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి.