సాక్షి మాక్ ఎంసెట్ 26కు వాయిదా | sakshi mock eamcet postponed to april 26 | Sakshi
Sakshi News home page

సాక్షి మాక్ ఎంసెట్ 26కు వాయిదా

Published Wed, Apr 8 2015 2:08 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

sakshi mock eamcet postponed to april 26

  • రిజిస్ట్రేషన్ల గడువు ఈ నెల 20 వరకు పొడిగింపు
  • సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించనున్న మాక్ ఎంసెట్ 26వ తేదీకి వాయిదా పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థుల ప్రయోజనం కోసం ‘సాక్షి’ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు హాజరయ్యేందుకు ఇప్పటికే వేలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే మొదట నిర్ణయించిన తేదీకి ముందు, తర్వాతి తేదీల్లో ఇతర ముఖ్యమైన పరీక్షలు ఉన్నందున మాక్ ఎంసెట్‌కు హాజరుకాలేకపోతున్నామని, పరీక్ష తేదీని మార్చాలని చాలామంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ‘సాక్షి’ని వ్యక్తిగతంగా, ఫోన్ల ద్వారా కోరారు. మాక్ ఎంసెట్ రాసేందుకు మరికొంత గడువునిచ్చి, తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశమివ్వాలని విద్యార్థులు విన్నవించారు.

    ఈ నేపథ్యంలో మాక్ ఎంసెట్‌ను ఈ నెల 26కు వాయిదా వేయాలని సాక్షి మీడియా గ్రూప్ నిర్ణయించింది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. అలాగే మాక్ ఎంసెట్ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోదలచిన విద్యార్థులకు ఈ నెల 20 వరకు గడువు పొడిగించడమైనది. రిజిస్ట్రేషన్ సెంటర్లు, పరీక్షా కేంద్రాల వివరాల కోసం sakshieducation.com లో చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement