Mock EAMCET
-
సాక్షి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘ఎంసెట్’ మాక్ టెస్టులు, రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
సాక్షి, ఎడ్యుకేషన్: ఇంటర్ తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ‘ఇంజనీరింగ్’..! ఇందు కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు ‘ఎంసెట్’ పరీక్ష కోసం ప్రిపేరవుతుంటారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ ప్రవేశ పరీక్షను త్వరలోనే నిర్వహించనున్నారు. ఒక వైపు కరోనా ప్రభావం..మరో వైపు భవిష్యత్‌కు దారి చూపే ప్రవేశ పరీక్ష! ఇలాంటి కష్ట సమయంలో తెలుగు విద్యార్థులకు అండగా నిలిచేందుకు సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ముందుకు వచ్చింది. ఇంటి నుంచే ఆన్లైన్ మాక్ ఎంసెట్ పరీక్ష రాసి..తమ ప్రతిభను సమీక్షించుకొని..ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకునేందుకు ఇదో చక్కని సదావకాశం. ఈ మాక్ టెస్టులను ప్రముఖ sakshieducation.com, Xplore సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. https://special.sakshi.com/online-classes/eapcet-registration లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత...లాగిన్ ID, Password ను ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీకి పంపిస్తారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థి మూడు ఆన్లైన్ టెస్టులకు హాజరుకావచ్చు. ఈ పరీక్షల ఫలితాలను ఆగస్టు 17వ తేదీన విడుదల చేస్తారు. అలాగే www.sakshieducation.com లో మార్కులను తెలుసుకోవడంతో పాటు ర్యాంక్ కార్డ్‌ను పొందవచ్చు. -
‘సాక్షి’ మాక్ ఎంసెట్ విజయవంతం
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని 36 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన మాక్ ఎంసెట్ విజయవం తమైంది. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు నిర్వహించిన ఈ పరీక్షకు విద్యార్థులు భారీసంఖ్యలో హాజరయ్యారు. 160 మార్కుల ప్రశ్నపత్రాన్ని ఇంజనీరింగ్ సీనియర్ ఫ్యాకల్టీ రూపొందించారు. వారం రోజుల్లో ఫలితాలను ప్రకటించనున్నారు. సాక్షి ఎడ్యుకేషన్ డాట్కాం సైట్లో మాక్ ఎంసెట్ ‘కీ’ సోమవారం తెల్లవారుజాము నుంచి అందుబాటులో ఉంటుంది. 23న మాక్ ‘నీట్’: మెడికల్‌కు సంబంధించిన మాక్ నీట్‌ను ఈ నెల 23న రెండు రాష్ట్రాల్లో 36 కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ నెల 19లోగా విద్యార్థులు రూ.150 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు 96664 21880 (గ్రేటర్ హైదరాబాద్), 96400 33107 (రాయలసీమ), 96662 83534 (ఉత్తరాంధ్ర), 96663 72301 (సెంట్రల్ ఆంధ్ర), 95055 14424 (తెలంగాణ) నంబర్లను సంప్రదించగలరు. -
ఏప్రిల్ 18న ‘సాక్షి’ మాక్ ఎంసెట్
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని లక్షలాది మంది ఇంజనీరింగ్, మెడికల్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ‘సాక్షి మాక్ ఎంసెట్-2016’ను నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 18వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. గత ఏడాది కూడా ‘సాక్షి’ నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు దాదాపు 20 వేల మంది హాజరై తమ ప్రతిభకు పదునుపెట్టుకున్నారు. ఈ మాక్ ఎంసెట్ ప్రశ్నపత్రాలను ‘సాక్షి భవిత’కు సంబంధించిన సీనియర్ లెక్చరర్లు రూపొందిస్తారు. ఎంసెట్ పరీక్షలకు పదిహేను రోజుల ముందు నిర్వహించే ఈ నమూనా పరీక్ష విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాకుండా ప్రతిభను పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. రూ. 100 చెల్లించి ‘సాక్షి’ మాక్ ఎంసెట్ దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చు. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకుని వస్తే వెంటనే హాల్‌టికెట్ కూడా పొందవచ్చు. దరఖాస్తు ఫారాలు లభించే కేంద్రాలు, పరీక్ష కేంద్రాల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి వేర్వేరుగా టాప్-10 ర్యాంకులు పొందినవారికి బహుమతులు అందజేస్తారు. ఇంటర్ కళాశాల నిర్వాహకులు ఏకమొత్తంగా ఈ మాక్ ఎంసెట్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మాక్ ఎంసెట్‌కు సంబంధించి సెంట్రల్ ఆంధ్రాలో 9666372301 నంబర్లో, ఉత్తరాంధ్ర 9666283534, రాయలసీమ 9640033107, తెలంగాణలో 9505514424, 9666421880 నంబర్లలో సంప్రదించవచ్చు. -
‘సాక్షి’ మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన
ఆరు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ 925 మంది విద్యార్థుల హాజరు విద్యార్థుల్లో మనోస్థైర్యం నింపిన పరీక్షలు ఒత్తిడి లేకుండా ఎంసెట్ పరీక్ష రాస్తామని ధీమా పరీక్షల నిర్వహణ పట్ల విద్యార్థుల తలిదండ్రుల హర్షం సాక్షి మాక్ ఎంసెట్‌కు 18,150 మంది హాజరు సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 18,150 మంది హాజరయ్యారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు కేంద్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ పరీక్షలు జరిగాయి. పరీక్ష ‘కీ’ సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ ‘www.sakshieducation.com’ లో చూడవచ్చు. పరీక్షా ఫలితాలను వారం రోజుల్లో వెల్లడించనున్నారు. ఇరు రాష్ట్రాలకు కలిపి.. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు నాలుగు నుంచి పదో ర్యాంకు సాధించిన విద్యార్థులకూ బహుమతులు ఇవ్వనున్నారు. ప్రథమ బహుమతిగా రూ. 15 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 10 వేలు, తృతీయ బహుమతిగా రూ. 7 వేలు, 4-10 ర్యాంకర్లు ఒక్కొక్కరికి రూ. 3 వేలు నగదు బహుమతిగా అందజేయనున్నారు. ఈ బహుమతులు ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలకు విడివిడిగా ఉంటాయి. సాక్షి మాక్ ఎంసెట్‌కు రాయలసీమ జిల్లాల నుంచి 2,564 మంది విద్యార్థులు హాజరుకాగా, ఒక్క చిత్తూరు జిల్లాలోనే 1,035 మంది పరీక్ష రాశారు. విశాఖ జిల్లాలో పరీక్ష రాసేందుకు 1,100మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా 925 మంది విద్యార్థులు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 774, కృష్ణాజిల్లా విజయవాడలో 1,246, గుంటూరు జిల్లాలో 710 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని వీఆర్ కళాశాలలో 500 మంది, ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాలలో నిర్వహించిన పరీక్షకు 330 మంది హాజరయ్యారు. ఒంగోలులో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ మాక్ ఎంసెట్‌తో పరీక్షపై మంచి అవగాహన వచ్చిందని, తమకు ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. లోపాలను సరిదిద్దుకోవచ్చు సాక్షి మీడియా గ్రూప్ మాక్ ఎంసెట్ నిర్వహణ పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మాక్ ఎంసెట్‌కు హాజర వడం వల్ల ఒత్తిడిని అధిగమించగలిగామని, లోపాలను సరిదిద్దుకొనే అవకాాశం లభించిందని పలువురు వి ద్యార్థులు పేర్కొన్నారు. ఎంసెట్ పరీ క్షా పత్రం మాదిరిగా ఈ పరీక్షా పత్రం ఉందని, ఇక్కడ తాము సాధించే మా ర్కులను బట్టి తమ ప్రతిభ ఏ స్థాయి లో ఉందో తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. తమ ర్యాంకులను మెరుగుపర్చుకునేందుకు ఈ మాక్ ఎంసెట్ దోహద పడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎంసెట్ పరీక్షలు మాదిరి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ పరీక్షకు హాజరవడం వల్ల పిల్లలకు బెరుకుతనం, ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఇక ఉండదని పేర్కొన్నారు. -
సాక్షి మాక్ ఎంసెట్ 26కు వాయిదా
రిజిస్ట్రేషన్ల గడువు ఈ నెల 20 వరకు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించనున్న మాక్ ఎంసెట్ 26వ తేదీకి వాయిదా పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థుల ప్రయోజనం కోసం ‘సాక్షి’ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు హాజరయ్యేందుకు ఇప్పటికే వేలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే మొదట నిర్ణయించిన తేదీకి ముందు, తర్వాతి తేదీల్లో ఇతర ముఖ్యమైన పరీక్షలు ఉన్నందున మాక్ ఎంసెట్‌కు హాజరుకాలేకపోతున్నామని, పరీక్ష తేదీని మార్చాలని చాలామంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ‘సాక్షి’ని వ్యక్తిగతంగా, ఫోన్ల ద్వారా కోరారు. మాక్ ఎంసెట్ రాసేందుకు మరికొంత గడువునిచ్చి, తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశమివ్వాలని విద్యార్థులు విన్నవించారు. ఈ నేపథ్యంలో మాక్ ఎంసెట్‌ను ఈ నెల 26కు వాయిదా వేయాలని సాక్షి మీడియా గ్రూప్ నిర్ణయించింది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. అలాగే మాక్ ఎంసెట్ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోదలచిన విద్యార్థులకు ఈ నెల 20 వరకు గడువు పొడిగించడమైనది. రిజిస్ట్రేషన్ సెంటర్లు, పరీక్షా కేంద్రాల వివరాల కోసం sakshieducation.com లో చూడవచ్చు.