పాలమూరులో సమంతకు ఓటు! | Samantha vote in Mahabubnagar district | Sakshi
Sakshi News home page

పాలమూరులో సమంతకు ఓటు!

Published Sun, Mar 23 2014 11:43 AM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM

పాలమూరులో సమంతకు ఓటు! - Sakshi

పాలమూరులో సమంతకు ఓటు!

గట్టు: ‘ఈగ’ సినిమా ఫేం తెలుసు కదా..! ప్రముఖ సినీనటి సమంత. ఆమె కూడా మహబూబ్‌నగర్ జిల్లా ఓటరేనండోయ్! సమంత ఏంటి..ఇక్కడ ఓటు ఉండటమేమిటి అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి ఇది నిజం. గట్టు మండల అధికారుల ఆమెకు మాచర్ల గ్రామ ఓటరు జాబితాలో చోటుకల్పించేశారు. 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడిలో మాచర్ల గ్రామ ఓటర్ జాబితాను పరిశీలిస్తున్న క్రమంలో శనివారం సమంత ఫొటోను చూసినవారు ఆశ్చర్యానికి గురయ్యారు. గ్రామ ఓటర్ జాబితాలో వరుస నెం.391, ఇంటి నెంబర్ 2-52 చిరునామా పేర గుడిసె మహేశ్వరి పేరున్న చోట ఆమె ఫొటోకు బదులు సమంత ఫొటో పెట్టారు. ఈ విషయమై తహశీల్దార్ సైదులును ‘న్యూస్‌లైన్’ వివరణ కొరగా.. గతంలో ఈ పొరపాటు జరిగి ఉంటుందని, ఉన్నతాధికారుల దృష్టికితీసుకెళ్లి ఫొటోను తొలగిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement