
సాక్షి, మేడ్చల్: ఓ స్కూల్ బస్సుకు మంగళవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీలో మంగళవారం ఉదయం విద్యార్థులను తీసుకుని వెళుతున్న బస్సు రోడ్డు పక్కనున్న మురికి కాలువలోకి దూసుకెళ్లింది. అనంతరం కిందపడకుండా పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో బస్సులో 11 మంది విద్యార్థులున్నారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీశారు. ఎవరికి ఏమికాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment