సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో నైతి కత లేకుంటే వినాశనమేనని సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్.మోహన్‌రావు అన్నారు. హన్మకొండ లోని కేడీసీలో శనివారం ఏర్పాటుచేసిన ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్ క్యాంప్‌లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
విద్యారణ్యపురి : సాంకేతిక పరిజ్ఞానం విని యోగంలో నైతికత లేకుంటే వినాశనమేనని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయెలాజీ(సీసీఎంబీ) డెరైక్టర్ డాక్టర్ సీహెచ్.మోహన్‌రావు పేర్కొన్నా రు. ఇంటర్ తర్వాత విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగానే కోర్సులు ఎం చుకోవాలని సూచించారు. బట్టీ విధానంలో కాకుండా విషయాన్ని విశ్లేషించుకుంటూ చది వితే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. బేసిక్‌సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనల వైపు దృష్టిసారిస్తే మంచి అవకాశాలుంటాయని చెప్పా రు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్‌అండ్ టెక్నాలజీ సహకారంతో హన్మకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(కేడీసీ)లో ఏర్పాటుచేసిన ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్ క్యాంప్‌ను శనివారం ఆయ న ప్రారంభించి మాట్లాడారు. ఇన్‌స్పైర్ తది తర కార్యక్రమాలతో విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ ఆర్. మార్తమ్మ మాట్లాడుతూ క్యాంపును విజయవంతం చేద్దామన్నారు. కేడీసీ అధ్యాపకుడు, ఇన్ స్పైర్ ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.సోమిరెడ్డి మాట్లాడుతూ, టెన్త్‌లో ప్రతిభచూపి ఇంటర్‌ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ఎంపిక చేసి ఐదు రోజులు వారికోసమే క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోహన్‌రావును అధ్యాపకులు సన్మానించారు.
ఢిల్లీ ఇగ్నోకు చెందిన డాక్టర్ ఎం.ప్రశాంత్‌రెడ్డి, కేయూ మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్ సింగరాయచార్య వివిధ టెక్నికల్ సెషన్‌లో మాట్లాడారు. కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకుడు డి.సురేశ్‌బాబు రాసిన జావా లాంగ్వేజ్ పుస్తకాన్ని సీసీఎంబీ డెరైక్టర్ మోహన్‌రావు ఆవిష్కరించారు. కేడీసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సురేశ్‌బాబు, డాక్టర్ కె.జాన్‌వెస్లీ, డా క్టర్ ఎన్‌వీఎన్.చారి, వినోలోయా మిల్కే, అ ధ్యాపకులు వాసం శ్రీనివాస్, రజనీలత, రవీం దర్‌రావు, డాక్టర్ చంద్రకళ, సంజీవయ్య, చి న్నా, సత్యనారాయణరావు పాల్గొన్నారు.
ఆసక్తి ఉన్న కోర్సులే ఎంచుకోవాలి
Published Sun, Nov 2 2014 6:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM