నల్లగొండ పట్టణంలో చెరుకు రసం అమ్ముతున్న రాజస్థాన్ యువకుడు
సాక్షి, నల్లగొండ టౌన్ : రాజస్థాన్ రాష్ట్ర నుంచి నల్లగొండ పట్టణానికి ఉపాధి కోసం వచ్చి యవకులు డిజిల్ ఇంజన్‌తో తయారు చేయించిన మొబైల్ చెరుకు బండ్లతో స్వయం ఉపాధి పొందుతున్నారు. రూ.50వేల పెట్టుబడితో సొంతంగా డిజిల్ మొబైల్ చెరుకు బండ్లను తయారు చేయించుకున్న యువకులు ప్రతి రోజు సుమారు రూ.3 వేల వరకు సంపాదిస్తున్నారు. ఖర్చులు పోను ప్రతి రోజు రెండు వేల వరకు సంపాదిస్తున్నారు,. వేసవికాలం సీజన్ ముగిసేంత వరకు వ్యాపారాన్ని కొనసాగిస్తూ తరువాత ఇతర సీజన్ వ్యాపారాలను చేసుకుంటున్నారు. సంపాదించిన డబ్బులను వారి స్వగ్రామాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు పంపిస్తూ వారికి కుటుంబాలకు ఆసరగా నిలుస్తున్న రాజస్థాన్ యువత ఆదర్శంగా తీసుకోవాలి.
మంచి ఉపాధి పొందుతున్నాం..
నల్లగొండ పట్టణంలో మొబైల్ చెరుకు రసం బండ్లతో మంచి ఉపాధిని పొందుతున్నాము. వ్యాపారం బాగానే సాగుతోంది. ఈ సీజన్ ముగియగానే మరో సీజన్ వ్యాపారం చేస్తాం. నెలనెల సంపాదించిన డబ్బులను కొంత ఇంటికి పంపిస్తాం. వ్యాపారం బాగా ఉంది.
– గోపాల్, రాజస్తాన్
Comments
Please login to add a commentAdd a comment