సెమీఫైనల్‌కు సింగరేణి జట్టు | semifinal singareni team | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్‌కు సింగరేణి జట్టు

Published Sun, Apr 19 2015 1:51 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

semifinal singareni team

యైటింక్లయిన్‌కాలనీ/సెంటినరీకాలనీ : సెంటినరీకాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో జరుగుతున్న కోలిండియాస్థాయి వాలీబాల్ పోటీల్లో బీ-గ్రూప్‌లో ఉన్న సింగరేణి జట్టు 7 పాయింట్లు సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో బీసీసీఎల్‌పై 2-0 స్కోర్‌తో గెలుపొందింది. బీ-గ్రూప్‌లోని ఎస్‌ఈసీఎల్ జట్టు కూడా సెమీఫైనల్‌కు వెళ్లింది. గ్రూప్- ఏలోని ఎన్‌సీఎల్ జట్టు ఈసీఎల్ జట్టుపై 2-0 తేడాతో గెలుపొందింది. డబ్ల్యూసీఎల్ జట్టు సీసీఎల్ జట్టుపై 2-0 పాయింట్లతో విజయం సాధించింది.
 
 ఆదివారం ఉదయం సెమీఫైనల్స్, సాయంత్రం ఫైనల్ జరగనుంది. సెమీఫైనల్స్‌లో సింగరేణి వర్సెస్ ఎన్‌సీఎల్, డబ్ల్యూసీఎల్ వర్సెస్ ఎస్‌ఈసీఎల్ జట్లు తలపడనున్నాయి. జట్ల వారీగా పాయింట్ల వివరాలిలా ఉన్నాయి. ఎన్‌సీఎల్-11, డబ్ల్యూసీఎల్-10, ఎస్‌ఈసీఎల్-8, సింగరేణి- 7, ఎంసీఎల్-4, సీసీఎల్-3, బీసీసీఎల్-3, ఈసీఎల్-2, సీఎంపీడీఐ-0 పాయింట్లు సాధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement