తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుడైన యువకుడి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు ఆర్థిక
అమరవీరుల పరిహారానికి రూ.10 వేల డిమాండ్
లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కలెక్టరేట్‌లో కలకలం
హన్మకొండ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుడైన యువకుడి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందిచే విషయంలో బాధి త కుటంబ సభ్యుల నుంచి రూ.10 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న కలెక్టరేట్ ’సీ‘ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ సునీల్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కలెక్టరేట్‌లో ఉపముఖ్యమంత్రి కడియంశ్రీహరి, అట వీశాఖ మంత్రి జోగురామన్న హరితహంరంపై బుధవారం సమీక్ష జరుపుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనతో కలెక్టరేట్‌లో అధికారులు, ఉద్యోగులు ఒ క్కసారిగా ఉలిక్కి పడ్డారు. అప్పటికే భోస జనవిరామ సమయం కావస్తుండటంతో ఎక్కడివారక్కడ ఇంటిదారి పట్టారు.
క్యాంటీన్ వద్దే అదుపులోకి..
ఏసీబీ డీఎస్పీ సారుుబాబా కథనం ప్రకా రం... రాష్ట్ర ప్రభుత్వం తొలిజాబితా లో ప్రకటించిన 99 మంది అమరవీరుల్లో సంగెం మండలం పల్లారిగుడాకు చెందని అలావత్ రాజేందర్ పేరుంది. రాజేందర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏప్రిల్ 2010లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీం తో తెలంగాణ ప్రభుత్వం రాజేందర్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించిది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తమకు రావాల్సిన డబ్బుల కో సం కలెక్టరేట్‌కు వస్తున్నారు. కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీ ల్‌కుమార్ వారిని రూ.10 వేలులం చం డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు బుధవా రం కలెక్టరేట్‌లోని క్యాంటీన్ వద్ద బాధితుడు భద్రు నుంచి తీసుకుంటుండగా అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారు లు సునీల్‌ను అదుపులోకి తీసకున్నారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌లోని ఆయన సెక్షన్ వద్దకు తీసుకొచ్చి వివరాలు సేకరించారు. సునీల్‌ను నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఇటీవలే డీటీగా పదోన్నతి
కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం లో చేరిన సునీల్ నర్సంపేటలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ కొద్ది నెలల క్రితం డిప్యూటేషన్‌పై కలెక్టరేట్‌కు వచ్చారు. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌గా సునీల్‌కు పదోన్నతి కూడా లభించింది.
పదోన్నతుల ఫైల్ ఇటీవల కలెక్టర్ ఆమోదం లభించింది. ఒకటి రెండు రోజుల్లో డిప్యూటీ తహసీల్దార్‌గా వెళ్లాల్సిన అతడు ఏసీబీకి చిక్కడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా సునీల్ గతంలో ఆత్మకూరు మం డలంలో పనిచేస్తున్న క్రమంలో ఓసారి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.