కలెక్టరేట్/మంచిర్యాల, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని పలు శాఖల్లో సాంకేతికపరంగా సేవలు నిలిచిపోనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో రెండు రోజులపాటు మీసేవ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్, ఖజానా, రవాఖ శాఖల్లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి వరకు అంటే సరిగ్గా 48 గంటలు సేవలు ఆగిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రక్రియతో జిల్లాలో పాలనపై ప్రభావం పడే అవకాశాలున్నాయి.
ఏర్పాట్లే కారణం
ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ‘సర్వర్’ కింద ఆయా విభాగాలు సేవలు అందించాయి. తెలంగాణ అపాయింటెడ్ డే(జూన్ 2) నుంచి శాఖలు రెండు రాష్ట్రాలకు వేర్వేరు కానున్నాయి. దీంతో తెలంగాణకు సంబంధించిన సర్వర్‌లను ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సర్వర్‌లను అ క్కడి సర్కారు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. సాంకేతి క పరమైన ఏర్పాట్లలో భాగంగా దాదాపు 48 గంటలపా టు సేవలు నిలిపివేయడం తప్పనిసరి అయింది.
ఈ నిర్ణయంతో మీ సేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు, విద్యు త్ బిల్లులు చెల్లించేవారికి తిప్పలు తప్పేలా లేవు. మరోవై పు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలోనూ భూక్రయ విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఉద్యోగుల వేతన భత్యాలు, వారికి అందాల్సిన సొమ్ముల విషయమై కార్యకలాపాల న్ని జరగే ఖజానా శాఖలో సేవల నిలిపివేత వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశాలున్నాయి. ఇప్పటికే దాదాపు ఉద్యోగులకు ఖజానా శాఖ వేతనాల చెల్లింపు అనుమతుల ప్రక్రి య పూర్తిచేసింది.
సేవలకు విరామం
రిజిస్ట్రేషన్, రవాణా, మీసేవ, ఖజానా ప్రభుత్వ శాఖలకు రూ.కోట్లు గండిపడే అవకాశం ఉంది. జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సర్వర్లు శుక్రవారం సాయంత్రం ఆగిపోయాయి.రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అకౌంట్లు, డా క్యూమెంట్లు సాయంత్రమే పూర్తి చేసుకోవాలని సబ్ రిజి స్ట్రార్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రోజుకు సుమారు 250వరకు డాక్యూమెంట్లు రిజిస్టర్ అ య్యేవి. ఒక్క రోజులో రూ. 50 లక్షల వరకు ప్రభుత్వాదా యం వచ్చేది. సర్వర్ల డౌన్‌తో మూడు రోజుల రిజిస్ట్రేష న్లు సుమారు రూ.1.50కోట్ల వరకు ఆదాయం ఆగిపోనుంది. మీ సేవ ద్వారా అందిస్తున్న సుమారు 323రకాల సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో సుమారు 1,000 నుంచి 1,200 వరకు ధ్రువీ కరణ పత్రాలు జారీకి సుమారు రూ. 6 నుంచి 8 లక్షల వరకు ఆదాయానికి గండిపడింది.
షట్‌డౌన్
Published Sat, May 31 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement
Advertisement