Competent
-
అర్హులందరికీ న్యాయం చేస్తాం
సంగం: అర్హులైన పింఛన్‌దారులందరికీ న్యాయం చేస్తామని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని జెండాదిబ్బ, అన్నారెడ్డిపాళెం, దువ్వూరు, మక్తాపురం గ్రామాల్లో వారు బుధవారం విస్తృతంగా పర్యటించి గ్రామీణలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ నాలుగు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో వారు మాట్లాడుతూ అర్హత ఉండి పింఛన్ కోల్పోయిన వారికి సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేసేలా చర్యలు చేపడతామన్నారు. భూమిలేని నిరుపేదలకు భూమి ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తామన్నారు. తాము అండగా ఉంటామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏ సమస్యనైనా తమ దృష్టికి తేవాలని సూచించారు. గ్రామవీధుల్లో నడుస్తూ సమస్యలపై ఆరా తీశారు. అన్నారెడ్డిపాళెంలో డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేస్తామన్నా. గ్రంథాలయ మరమ్మతులకు నిధులు మంజూరు అంశాన్ని పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చారు. దువ్వూరులో పలువురు వృద్ధులు, వితంతువులు, దళితులు, గిరిజనులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మక్తాపురంలో ఇందిరమ్మ గృహాలు మంజూరు కాలేదని, ఎంతో కాలంగా కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథులే లేరని బాధితులు వాపోయారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు నిలిపివేస్తున్నారని, పథకాన్ని పునరుద్ధరించగానే అర్హులకు ఇళ్లు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరుచేసిన రహదారులు వేసే ప్రాంతాలను కూడా వారు పరిశీలించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లు సుధాకర్ రెడ్డి, సంగం జెడ్పీటీసీ దేవసహాయం, సంగం మండల ప్రచార కమిటీ కన్వీనర్ మెట్టుకూరు వాసుదేవరెడ్డి, సూరి మదన్‌మోహన్‌రెడ్డి, కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి, దగ్గుమాటి మధుసూదన్ రెడ్డి, పులంగం శంకర్‌రెడ్డి, షేక్ మైమున్నీసా, రఘునాథరెడ్డి, జెక్కా సుబ్బారెడ్డి, యానాదిరెడ్డి, ఫణికుమార్‌రెడ్డి, మనోజ్ రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సూరి ఇందిరమ్మ, ఎంపీటీసీ సభ్యులు రంగయ్య, లక్ష్మీప్రసన్న, ముడి మల్లికార్జునరెడ్డి, శంకరయ్య, చిన్నా, మోహన్, దయాకర్ రెడ్డి, ఓబుల్, వెంకటేశ్వర్లు రెడ్డిపాల్గొన్నారు. -
శృతిమించి ఫొటోలు పెడితే..
పొగడ్తలకు పడని వారు ఉండరు. అందులోనూ అమ్మాయిలు తమ అందం గురించి పొడిగించుకోవటం అంటే ఇష్టం. తాము అందంగా ఉన్నామనే ప్రశంసలు పొందడానికి టీనేజ్ అమ్మాయిలు తరచూ ఫేస్బుక్లో ఫొటోలు పెడుతుంటారు. అయితే సోషల్ వెబ్సైట్లలో అందమైన, సెక్సీ ఫొటోలను పోస్టుచేస్తున్న అమ్మాయిల్లో అంతగా పోటీతత్వం లేదనే అభిప్రాయం సహచర యువతుల్లో ఉందని తాజా పరిశోధనలో తేలింది. శారీరకంగా, సామాజికంగా అంతగా ఆకర్షణీయంగా లేనివారే తరచూ ఫొటోలు పెడుతుంటారని, అలాంటి అమ్మాయిల్లో పోటీపడి పనిచేసే తత్వం తక్కువని అభిప్రాయం ఏర్పడుతున్నదని ఆ పరిశోధన తేల్చింది. ఫేస్బుక్ కల్పిత ఖాతాలను ఏర్పాటు చేసి.. వాటిపై అధ్యయనం చేయడం ద్వారా పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ‘సోషల్ మీడియాలోని ఫొటోల పట్ల తక్కువ భావన ఉన్నదన్నది సుస్పష్టం’ అని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, పరిశోధకుడు ఎలిజబెత్ డానియెల్స్ తెలిపారు. ‘తమను తాము అందంగా, సెక్సీగా చూపించాలన్న తాపత్రయం టీనేజ్ అమ్మాయిల్లో, యువతుల్లో అధికంగా ఉంటుంది. అయితే సెక్సీ ఫొటోలు పెట్టడం వల్ల సానుకూలత కన్నా ప్రతికూల పరిణామాలే ఎక్కువగా ఉన్నాయి’ అని తెలిపారు. అమ్మాయిలు శృతిమించి ఫొటోలు పెడితే.. అబ్బాయిలు, యువకులు వారిపట్ల క్రమంగా ఆకర్షణ కోల్పోయే అవకాశముందని చెప్పారు. -
షట్‌డౌన్
కలెక్టరేట్/మంచిర్యాల, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని పలు శాఖల్లో సాంకేతికపరంగా సేవలు నిలిచిపోనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో రెండు రోజులపాటు మీసేవ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్, ఖజానా, రవాఖ శాఖల్లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి వరకు అంటే సరిగ్గా 48 గంటలు సేవలు ఆగిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రక్రియతో జిల్లాలో పాలనపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఏర్పాట్లే కారణం ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ‘సర్వర్’ కింద ఆయా విభాగాలు సేవలు అందించాయి. తెలంగాణ అపాయింటెడ్ డే(జూన్ 2) నుంచి శాఖలు రెండు రాష్ట్రాలకు వేర్వేరు కానున్నాయి. దీంతో తెలంగాణకు సంబంధించిన సర్వర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సర్వర్లను అ క్కడి సర్కారు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. సాంకేతి క పరమైన ఏర్పాట్లలో భాగంగా దాదాపు 48 గంటలపా టు సేవలు నిలిపివేయడం తప్పనిసరి అయింది. ఈ నిర్ణయంతో మీ సేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు, విద్యు త్ బిల్లులు చెల్లించేవారికి తిప్పలు తప్పేలా లేవు. మరోవై పు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలోనూ భూక్రయ విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఉద్యోగుల వేతన భత్యాలు, వారికి అందాల్సిన సొమ్ముల విషయమై కార్యకలాపాల న్ని జరగే ఖజానా శాఖలో సేవల నిలిపివేత వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశాలున్నాయి. ఇప్పటికే దాదాపు ఉద్యోగులకు ఖజానా శాఖ వేతనాల చెల్లింపు అనుమతుల ప్రక్రి య పూర్తిచేసింది. సేవలకు విరామం రిజిస్ట్రేషన్, రవాణా, మీసేవ, ఖజానా ప్రభుత్వ శాఖలకు రూ.కోట్లు గండిపడే అవకాశం ఉంది. జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సర్వర్లు శుక్రవారం సాయంత్రం ఆగిపోయాయి.రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అకౌంట్లు, డా క్యూమెంట్లు సాయంత్రమే పూర్తి చేసుకోవాలని సబ్ రిజి స్ట్రార్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రోజుకు సుమారు 250వరకు డాక్యూమెంట్లు రిజిస్టర్ అ య్యేవి. ఒక్క రోజులో రూ. 50 లక్షల వరకు ప్రభుత్వాదా యం వచ్చేది. సర్వర్ల డౌన్‌తో మూడు రోజుల రిజిస్ట్రేష న్లు సుమారు రూ.1.50కోట్ల వరకు ఆదాయం ఆగిపోనుంది. మీ సేవ ద్వారా అందిస్తున్న సుమారు 323రకాల సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో సుమారు 1,000 నుంచి 1,200 వరకు ధ్రువీ కరణ పత్రాలు జారీకి సుమారు రూ. 6 నుంచి 8 లక్షల వరకు ఆదాయానికి గండిపడింది.