
మంత్రి హరీష్ రావు(పాత చిత్రం)
హైదరాబాద్ : రైతు బజార్ మాదిరిగానే రైతుకు, వినియోగదారునికి అనుకూలంగా ప్రతి డివిజన్లో ‘మన కూరగాయలు’ పేరుతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రామంతపూర్ కేసీఆర్ నగర్లో రైతు బజార్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ , ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ , కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ..కొంత ఆలస్యమైనా కూడా రామంతపూర్లో అత్యాధునిక సౌకర్యాలతో, ఎన్ని నిధులైనా కూడా మంచి రైతు బజార్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 50 స్టాల్స్ ప్రారంభించామని, త్వరలో అన్ని డివిజన్లలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment