ఖమ్మం అర్బన్: అభం శుభం తెలియని ఓ చిన్నారిని ఓ కా మాంధుడు కాటేశాడు. అంకుల్ అంటూ తన ఇంట్లో టీవి చూడటానికి వచ్చిన చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై బుధవారం అర్బన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం నగరంలోని వ రదయ్యనగర్‌లో నివాసముంటున్న కారుడ్రైవర్ కూ తురు పాఠశాల నుంచి ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత పక్కనే ఉంటున్న తల్వార్ జాన్‌పాల్ ఇంటికి టీవీ చూడడానికి వెళ్లింది.
ఆ సమయంలో జాన్‌పాల్ ఇంట్లో ఎవరూ లేరు. ఇదే అదనుగా భావించిన జాన్‌పాల్ చిన్నారిని తన ఇంట్లోని బాత్ రూంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఏడుస్తూ ఆ చిన్నారి ఇంటికి చేరింది. ఏం జరిగిందని కుటంబ సభ్యులు అడిగితే జరిగిన ఘాతుకం వివరించింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు జాన్‌పాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
3వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి
Published Thu, Mar 31 2016 12:45 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement