
మళ్లీ మంచి రోజులొస్తాయి: షర్మిల
ముగిసిన మలి విడత పరామర్శ యాత్ర
♦ 4వ రోజు ఒక కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ తనయ
♦ తొలి విడతలో 30, మలివిడతలో 18 కుటుంబాలను కలసిన షర్మిల
♦ ఐదేళ్ల తర్వాత కూడా వచ్చి పలకరించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
♦ నల్లకాల్వ సాక్షిగా జగన్ ఇచ్చిన మాటను నిలుపుకునేందుకే: ఎంపీ పొంగులేటి
♦ నెలాఖరులో రంగారెడ్డి జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
♦ గిరిజనులకు అన్యాయంపై నిరాహారదీక్ష చేపడతామని ప్రకటన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కలుసుకుని మనోస్థ్యైరా న్ని నింపేందుకు నల్లగొండ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మలివిడత పరామర్శ యాత్ర ముగిసింది. శుక్రవారం నాలుగోరోజు చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో బిట్ర వసంతరావు కుటుంబాన్ని ఆమె పరామర్శిం చారు. వారితో ఆత్మీయంగా మాట్లాడి కష్టసుఖాలను తెలుసుకుని ధైర్యం చెప్పారు. వారికి తమ కుటుంబం అండగా ఉంటుందని, మళ్లీ మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని వసంతరావు కుమారుడు రాము మనోజ్‌కుమార్‌కు చెప్పారు.
వసంతరావు తల్లిదండ్రులు అనంతమ్మ, వెంకటేశ్వర్లు, భార్య వెంకట్రావమ్మలతో ఆత్మీయంగా మాట్లాడారు. వెంకట్రావమ్మ తల్లి 4రోజుల క్రి తం చనిపోయిందంటూ వారు కన్నీటిపర్యంతం కావడంతో షర్మిల కూడా కంటతడి పెట్టారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఎడ్మ కిష్ణారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు పి.సిద్ధార్థరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు బీష్వ రవీందర్, వెల్లాల రామ్మోహన్, ముజ్తబా అహ్మద్, మెండెం జయరాజ్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, అయిలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, సెగ్గెం రాజేశ్, కుసుమకుమార్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, షర్మిలా సంపత్, డాక్టర్ల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దోరేపల్లి శ్వేత, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా, నాయకులు ఫయాజ్‌ఖాన్, మందా వెంకటేశ్వర్లు, మరియదాస్, వంగూరి శ్రీనివాస్‌యాదవ్ తదితరులు షర్మిల వెంట ఉన్నారు.
10 రోజులు... 48 కుటుంబాలు
నల్లగొండ జిల్లాలో షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర పూర్తయింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో ప్రాణాలొదిలిన 48 మంది కుటుంబాలను ఆమె పరామర్శించారు. తొలివిడతలో గత జనవరి 21 నుంచి 26 వరకు 30 కుటుంబాలను కలిశారు. జూన్ 9 నుంచి శుక్రవారం దాకా మలివిడత యాత్రలో 18 కుటుంబాలను పరామర్శించారు. షర్మిల యాత్రకు జిల్లా ప్రజల నుంచి అడుగడుగునా ఎంతో స్పందన లభించింది. దివంగత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు ఊరూరా సాదర స్వాగతం పలికారు. దాదాపు ప్రతి గ్రామంలోనూ డప్పుచప్పుళ్లు, కోలాటాలతో గ్రామస్తులు ఆత్మీయంగా ఆహ్వానించారు.
షర్మిల వెళ్లిన కుటుంబాల సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. పెద్ద దిక్కును కోల్పోయిన తమను షర్మిల వచ్చి పలకరిస్తామని ఊహించలేదని, ఆమె రాక తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని వారన్నారు. షర్మిలకు ప్రేమతో మజ్జిగన్నం, పాయసం, స్వీట్లు, కొబ్బరిబోండాలు, పాలు... ఇలా తమకు తోచిన విధంగా అందించి ఆప్యాయత చాటుకున్నారు. ప్రతి కుటుంబంలోని వారినీ షర్మిల పేరుపేరునా తెలుసుకోవడంతో పాటు వారి బాగోగుల గురించి వాకబు చేయడం వారిలో సంతోషం నింపింది. వైఎస్ మరణించి ఐదేళ్లు దాటాక కూడా తమను గుర్తుపెట్టుకుని షర్మిల వచ్చి పరామర్శించడాన్నిమర్చిపోలేమని వారన్నారు. ఇది ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యమని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
అందరి నోటా వైఎస్ అభివృద్ధే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలంతా వైఎస్సార్ చేసిన అభివృద్ధినే తలచుకున్నారని పొం గులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన ప్రతి ఒక్కరి కుటుంబాన్నీ కలుసుకుంటానని నాడు నల్లకాలువ సాక్షిగా వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలుపుకునేందుకే ఆయన తరఫున సోదరి షర్మిల యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ఈ నెలాఖరులో రంగారెడ్డి జిల్లాలో ఆమె పరామర్శ యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు.
రుణమాఫీని వైఎస్ పూర్తిస్థాయిలో అమలు చేసి, వారంలోనే కొత్త రుణాలిప్పిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల హామీలను, మేనిఫెస్టో వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించా రు. నాలుగు విడతల్లో మాఫీచేస్తే ఆ సొమ్ము ఏటా వడ్డీ కిందే జమవుతుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా సక్రమంగా అమలు చేయడం లేదని, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాల అంశాన్నే ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో గిరిజను ల భూముల పట్టాలను లాక్కోజూస్తోందన్నారు. దీనిపై త్వరలో నిరాహారదీక్ష చేపడతామని ప్రకటించారు.