paramarsha yathra
-
మళ్లీ మంచి రోజులొస్తాయి: షర్మిల
ముగిసిన మలి విడత పరామర్శ యాత్ర ♦ 4వ రోజు ఒక కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ తనయ ♦ తొలి విడతలో 30, మలివిడతలో 18 కుటుంబాలను కలసిన షర్మిల ♦ ఐదేళ్ల తర్వాత కూడా వచ్చి పలకరించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ♦ నల్లకాల్వ సాక్షిగా జగన్ ఇచ్చిన మాటను నిలుపుకునేందుకే: ఎంపీ పొంగులేటి ♦ నెలాఖరులో రంగారెడ్డి జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ♦ గిరిజనులకు అన్యాయంపై నిరాహారదీక్ష చేపడతామని ప్రకటన సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కలుసుకుని మనోస్థ్యైరా న్ని నింపేందుకు నల్లగొండ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మలివిడత పరామర్శ యాత్ర ముగిసింది. శుక్రవారం నాలుగోరోజు చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో బిట్ర వసంతరావు కుటుంబాన్ని ఆమె పరామర్శిం చారు. వారితో ఆత్మీయంగా మాట్లాడి కష్టసుఖాలను తెలుసుకుని ధైర్యం చెప్పారు. వారికి తమ కుటుంబం అండగా ఉంటుందని, మళ్లీ మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని వసంతరావు కుమారుడు రాము మనోజ్‌కుమార్‌కు చెప్పారు. వసంతరావు తల్లిదండ్రులు అనంతమ్మ, వెంకటేశ్వర్లు, భార్య వెంకట్రావమ్మలతో ఆత్మీయంగా మాట్లాడారు. వెంకట్రావమ్మ తల్లి 4రోజుల క్రి తం చనిపోయిందంటూ వారు కన్నీటిపర్యంతం కావడంతో షర్మిల కూడా కంటతడి పెట్టారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఎడ్మ కిష్ణారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు పి.సిద్ధార్థరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు బీష్వ రవీందర్, వెల్లాల రామ్మోహన్, ముజ్తబా అహ్మద్, మెండెం జయరాజ్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, అయిలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, సెగ్గెం రాజేశ్, కుసుమకుమార్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, షర్మిలా సంపత్, డాక్టర్ల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దోరేపల్లి శ్వేత, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా, నాయకులు ఫయాజ్‌ఖాన్, మందా వెంకటేశ్వర్లు, మరియదాస్, వంగూరి శ్రీనివాస్‌యాదవ్ తదితరులు షర్మిల వెంట ఉన్నారు. 10 రోజులు... 48 కుటుంబాలు నల్లగొండ జిల్లాలో షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర పూర్తయింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో ప్రాణాలొదిలిన 48 మంది కుటుంబాలను ఆమె పరామర్శించారు. తొలివిడతలో గత జనవరి 21 నుంచి 26 వరకు 30 కుటుంబాలను కలిశారు. జూన్ 9 నుంచి శుక్రవారం దాకా మలివిడత యాత్రలో 18 కుటుంబాలను పరామర్శించారు. షర్మిల యాత్రకు జిల్లా ప్రజల నుంచి అడుగడుగునా ఎంతో స్పందన లభించింది. దివంగత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలకు ఊరూరా సాదర స్వాగతం పలికారు. దాదాపు ప్రతి గ్రామంలోనూ డప్పుచప్పుళ్లు, కోలాటాలతో గ్రామస్తులు ఆత్మీయంగా ఆహ్వానించారు. షర్మిల వెళ్లిన కుటుంబాల సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. పెద్ద దిక్కును కోల్పోయిన తమను షర్మిల వచ్చి పలకరిస్తామని ఊహించలేదని, ఆమె రాక తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని వారన్నారు. షర్మిలకు ప్రేమతో మజ్జిగన్నం, పాయసం, స్వీట్లు, కొబ్బరిబోండాలు, పాలు... ఇలా తమకు తోచిన విధంగా అందించి ఆప్యాయత చాటుకున్నారు. ప్రతి కుటుంబంలోని వారినీ షర్మిల పేరుపేరునా తెలుసుకోవడంతో పాటు వారి బాగోగుల గురించి వాకబు చేయడం వారిలో సంతోషం నింపింది. వైఎస్ మరణించి ఐదేళ్లు దాటాక కూడా తమను గుర్తుపెట్టుకుని షర్మిల వచ్చి పరామర్శించడాన్నిమర్చిపోలేమని వారన్నారు. ఇది ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యమని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అందరి నోటా వైఎస్ అభివృద్ధే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలంతా వైఎస్సార్ చేసిన అభివృద్ధినే తలచుకున్నారని పొం గులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన ప్రతి ఒక్కరి కుటుంబాన్నీ కలుసుకుంటానని నాడు నల్లకాలువ సాక్షిగా వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలుపుకునేందుకే ఆయన తరఫున సోదరి షర్మిల యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ఈ నెలాఖరులో రంగారెడ్డి జిల్లాలో ఆమె పరామర్శ యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. రుణమాఫీని వైఎస్ పూర్తిస్థాయిలో అమలు చేసి, వారంలోనే కొత్త రుణాలిప్పిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల హామీలను, మేనిఫెస్టో వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించా రు. నాలుగు విడతల్లో మాఫీచేస్తే ఆ సొమ్ము ఏటా వడ్డీ కిందే జమవుతుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా సక్రమంగా అమలు చేయడం లేదని, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాల అంశాన్నే ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో గిరిజను ల భూముల పట్టాలను లాక్కోజూస్తోందన్నారు. దీనిపై త్వరలో నిరాహారదీక్ష చేపడతామని ప్రకటించారు. -
ముగిసిన ‘పరామర్శ’
జిల్లాలో షర్మిల మలివిడత యాత్ర పూర్తి ♦ చివరి రోజు ఒక కుటుంబానికి పరామర్శ ♦ మలివిడతలో మొత్తం 6 నియోజకవర్గాలు...18 కుటుంబాలు ♦ తొలివిడత కలిపి మొత్తం 48 కుటుంబాలను కలిసిన వైఎస్ తనయ ♦ వైఎస్సార్ కాంగ్రెస్ కేడర్‌లో నూతనోత్సాహం ప్రేమతో మజ్జిగన్నం, పాయసం, స్వీట్లు... కొబ్బరిబోండాలు, మజ్జిగ, పాలు.. వైఎస్ తనయ షర్మిలకు అందించి తమ అభిమానం చాటుకున్నవారు కొందరైతే..సంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన ఆడపడుచుకు చీర, గాజులు అందించిన వారు మరికొందరు.. ఇదీ..షర్మిల పట్ల జిల్లా ప్రజలు చూపిన ఆదరణ..ఆప్యాయత. రెండు విడతలుగా జరిగిన షర్మిల పరామర్శయాత్రకు జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో అసువులుబాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మలివిడత పరామర్శయాత్ర ముగిసింది. చివరి రోజైన శుక్రవారం ఆమె చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెంలో ఒక కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. మలివిడత యాత్రలో భాగంగా ఆమె జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నాలుగు రోజులు పర్యటించి 18 కుటుంబాలను కలుసుకుని వైఎస్ కుటుంబ ప్రతినిధిగా ఆత్మీయతను పంచారు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి వారేం చేస్తున్నారో తెలుసుకుని, తగిన సూచనలు చేస్తూ, సలహాలిస్తూ, కుటుంబ బాధ్యతలు మోస్తున్న వారికి బాధ్యతలను గుర్తు చేస్తూ ఆప్యాయంగా సాగిన పరామర్శయాత్ర ఆయా కుటుంబాల సభ్యుల్లో మనోస్థైర్యాన్ని నింపింది. చివరి రోజు ఒక్కటి... మలివిడత పరామర్శయాత్రలో భాగంగా నాలుగోరోజు షర్మిల చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో బిట్ర వసంతరావు కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆయన భార్య వెంకట్రావమ్మ, తల్లిదండ్రులు అనంతమ్మ, వెంకటేశ్వర్లు, కుమారుడు రాము మనోజ్‌తో మాట్లాడారు. అందరూ ధై ర్యంగా ఉండాలని చెప్పిన షర్మిల, బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని వసంతరావు కుమారుడు రాము మనోజ్‌కు సూచించారు. ఈ సందర్భంగా వెంకట్రావమ్మ తన తల్లి ఇటీవలే చనిపోయారన్న విషయాన్ని చెప్పినప్పుడు షర్మిల కూడా కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో పరామర్శ ప్రాంగణంలో ఉన్నవారి కళ్లు కూడా చెమ్మగి ల్లాయి. వసంతరావు కుటుంబ సభ్యులు బోరున విలపించడంతో షర్మిల కూడా ఉద్వేగాన్ని ఆపులేకపోయారు. వారికి ధైర్యం చెప్పిన షర్మిల తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీంతో షర్మిల మలివిడత పరామర్శయాత్ర ముగిసినట్టయింది. షర్మిల వెంట వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఎడ్మ కిష్ణారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు పి. సిద్ధార్థరెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు భీష్వరవీందర్, వెల్లాల రామ్మోహన్, ముజ్తబా అహ్మద్, మెండెం జయరాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు వేముల శేఖర్‌రెడ్డి, పార్టీ సంయుక్త కార్యదర్శులు గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా తదితరులున్నారు. ఆరు నియోజకవర్గాలు... నాలుగు రోజులు జిల్లాలో షర్మిల మలివిడత యాత్ర ఉత్సాహంగా సాగింది. మొదటి రోజు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఐదు కుటుంబాలను షర్మిల కలుసుకున్నారు. అక్కడ ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. రెండోరోజు ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల మీదుగా ఆరు కుటుంబాలను పరామర్శిస్తూ యాత్ర సాగింది. మూడోరోజు నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలో మరో ఆరు కుటుంబాలను ఆమె కలుసుకున్నారు. చివరిరోజు మిగిలిన ఒక్క కుటుంబాన్ని పరామర్శించి ఆమె హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ నాలుగు రోజుల పాటు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులన్నీ శ్రమించి యాత్రను విజయవంతం చేశాయి. పరామర్శయాత్రలో భాగంగా జిల్లాలో మొత్తం 48 కుటుంబాలను కలుసుకున్నారు షర్మిల. తొలివిడతలో భాగంగా ఈ ఏడాది జనవరిలో జరిగిన యాత్రలో ఆమె దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఆరు రోజుల పాటు పర్యటించి 30 కుటుంబాలను కలుసుకున్నారు. మలివిడతలో 18 కుటుంబాలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిలకు జిల్లాలో అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. ‘ఫ్యాను’... మరింత జోరు జిల్లాలో షర్మిల చేపట్టిన యాత్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. జగన్మోహన్రెడ్డి సోదరి పార్టీ పక్షాన చేపట్టిన యాత్ర విజయవంతం కావడం ఆ పార్టీ నేతలకు కొత్త ఊపిరినిచ్చింది. ఇటీవలే జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన అయిల వెంకన్నగౌడ్‌తో పాటు పార్టీ శ్రేణులన్నీ పరామర్శ యాత్ర కోసం కృషి చేశాయి. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలందరూ షర్మిల యాత్రతో మళ్లీ పునరుత్తేజితులయ్యారు. వైఎస్సార్ ఆశయ సాధనే ధ్యేయంగా పార్టీ పటిష్టత కోసం కృషి చేసేందుకు తమకు ఈ యాత్ర ఎంతో స్ఫూర్తిని నింపిందని, జగనన్న ఇచ్చిన మాట తప్పడనే దానికి నిదర్శనమే ఈ యాత్ర అని ఆ పార్టీ నేతలంటున్నారు. అందరికీ కృత జ్ఞతలు షర్మిల పరామర్శ యాత్ర జిల్లాలో విజయవంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పరామర్శకు సహకరించిన పలు కుటుంబాలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, ప్రజలకు ఆయన పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. షర్మిల యాత్ర స్ఫూర్తితో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటామని, క్షే త్రస్థాయి నుంచి పార్టీకేడర్‌ను ఏర్పాటు చేసుకుంటామని ఆయన వెల్లడించారు. - డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
వైఎస్‌ను తరతరాలూ గుర్తుంచుకుంటాం
ఆయన నగరబాట... మా జీవితాల్లో వెలుగుబాట ♦ పరామర్శ యాత్రలో షర్మిలతో నల్లగొండవాసులు ♦ నల్లగొండ జిల్లాలో మూడో రోజు ఆరు కుటుంబాలకు పరామర్శ ♦ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకెళ్తున్న వైఎస్ తనయ ♦ అడుగడుగునా ప్రజల నుంచి ఆదరణ వెల్లువ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘2006లో వైఎస్ నల్లగొండ పట్టణానికి నగరబాటకు వచ్చారు.ఆ సందర్భంగా మా దుకాణాలు ఇరుకుగా ఉన్న విషయాన్ని గమనించారు. వెంటనే కలెక్టర్‌ను పిలిపించారు. పాత కలెక్టరేట్ స్థలాన్ని స్వర్ణకారులకు కేటాయించాల్సిందిగా ఆదేశించారు. దాంతో మా 160 కుటుంబాలకు వ్యాపారం చేసుకునేందుకు గూడు దొరికింది. వైఎస్ చేసిన మేలును మేం తరతరాలు గుర్తుంచుకుంటాం’’ నల్లగొండ పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు రాచకొండ గిరి మాటలివి. మలి విడత పరామర్శ యాత్రలో భాగంగా గురువారం పట్టణంలో పాండేకర్ దయానంద్ కుటుంబాన్ని సందర్శించిన షర్మిలకు ఈ విషయాన్ని చెమర్చిన కళ్లతో వివరించారాయన. వైఎస్‌ను ఎన్నోసార్లు కలిశానని, తనను ప్రేమతో చెంపపై తట్టేవారని చెబుతూ మహానేతతో తనకున్న ఆత్మీయానుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. యాత్రలో మూడో రోజు గురువారం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ఆరుగురి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకుని కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మూడోరోజు పర్యటన ఇలా రెండో రోజు పరామర్శ అనంతరం నకిరేకల్ పట్టణంలో రాత్రి బస చేసిన షర్మిల మూడో రోజు ఉదయం నకిరేకల్ నుంచి మర్రూర్ మీదుగా నల్లగొండ నియోజకవర్గ పరిధిలో తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి వెళ్లారు. రాయించు నర్సింహ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఇంట్లోని చిన్నారులతో ఆడుకున్నారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం సిలార్మియా గూడెంలో వైఎస్ విగ్రహానికి గ్రామస్తుల కోరిక మేరకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత తిప్పర్తి మండల కేంద్రంలో గుంటి వెంకటేశం కుటుంబాన్ని కలుసుకుని మాట్లాడారు. ఆరుబయట ఏర్పాటు చేసిన టెంట్లోనే పెద్ద ఎత్తున గుమిగూడిన జనసందోహం నడుమ వారితో గడిపారు. వారు బహూకరించిన గాజులు వేసుకున్నారు. నల్లగొండ మండలం చందనపల్లి వెళ్లి చింతా భిక్షమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. పానగల్ ప్రాజెక్టు ముంపు గ్రామమైనందున వైఎస్ హయాంలోనే తమకు రూ.26 కోట్ల నిధులు మంజూరు చేశారని ఈ సందర్భంగా ఓ గ్రామస్తుడు గుర్తు చేసుకున్నారు. వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయిస్తే ఆయన్ను రోజూ తలచుకుంటామని చెప్పారు. అనంతరం నల్లగొండ పట్టణంలోని సిమెంట్ రోడ్డులో ఉన్న పాండేకర్ దయానంద్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. బాగా చదువుకోవాలని దయానంద్ పిల్లలకు సూచించారు షర్మిల. కుటుంబ సభ్యులు ప్రేమతో ఇచ్చిన కొబ్బరిబొండాం తాగారు. అనంతరం కనగల్ మండల కేంద్రంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాంపల్లి చేరుకుని అస్తర్ బీ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి మర్రిగూడ మండలం తాన్‌దార్‌పల్లిలో మునగాల పుల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. షర్మిల వెంట రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, సేవాదళం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ ముజ్తబా అహ్మద్, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు జార్జి హెర్బర్ట్. గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్రా భిక్షపతి, రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ పి.సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ర్ట కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, కుసుమకుమార్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, అమృతాసాగర్, ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఇరుగు సునీల్‌కుమార్, పిట్ట రాంరెడ్డి, ఎం.డి.సలీం, ఖమ్మం జిల్లా మధిర ఎంపీపీ లక్ష్మారెడ్డి, యువజన విభాగం నాయకుడు కొన నరందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆద్యంతం ఆత్మీయ స్వాగతం షర్మిల పరామర్శ యాత్రకు నల్లగొండ జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది. షర్మిలను ప్రజలు అడుగడుగునా ఆత్మీయంగా స్వాగతిస్తున్నారు. గురువారం గ్రామగ్రామాన డప్పుచప్పుళ్లు, కోలాటాలతో తమ ఊరి ఆడబిడ్డ మాదిరిగా ఆమెను ఊళ్లోకి తీసుకెళ్లారు. రాజన్న కుమార్తె తమ ఊరికి వచ్చిందంటూ ఆమెను చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ కుటుంబంపై ప్రేమను చాటుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు షర్మిలను చూసేందుకు, మాట్లాడేందుకు పోటీలు పడ్డారు. ఆమెను సెల్ఫోన్లలో బంధించేందుకు యువతీ యువకులు ఉత్సాహపడ్డారు. గురువారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలకేంద్రంలో దస్తగిరి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరిస్తున్న షర్మిల. చిత్రంలో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. తిప్పర్తి మండల కేంద్రంలో గుంటి వెంకటేశం కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యం. చిత్రంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ తదితరులు -
మూడో రోజూ.. అదే జోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆత్మీయ అనురాగాలు, ఆప్యాయతల నడుమ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతోంది. పరామర్శ యాత్రలో భాగంగా మూడోరోజు గురువారం షర్మిల జిల్లాలోని నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన ఆరు కుటుంబాలను కలిసిన ఆమె .. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి మండలం ఇందుగుల, తిప్పర్తి మండల కేంద్రం, నల్లగొండ రూరల్‌మండలం చందనపల్లి, నల్లగొండ జిల్లా కేంద్రం, నాంపల్లి మండల కేంద్రం, మర్రిగూడ మండలం తానేదార్పల్లిలకు వెళ్లిన షర్మిల అక్కడ తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన ఆప్యాయతలను పంచారు. ఆయా కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్న షర్మిల అక్కడ వారు ప్రేమతో తినిపించిన స్వీట్లు, పాయసం తిని వారి చిన్నారులతో ఆడుకున్నారు. పెద్దవారికి బాధ్యతలను గుర్తు చేస్తూ, చిన్నారులు బాగా చదువుకోవాలంటూ సూచించిన షర్మిల ఆయా కుటుంబాలకు తమ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, షర్మిల పరామర్శయాత్ర శుక్రవారం ముగియనుంది. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో బిట్ర వసంతరావు కుటుంబాన్ని పరామర్శించడంతో జిల్లాలో మలి విడత పరామర్శయాత్ర పూర్తి కానుంది. ముచ్చటగా.... మూడో రోజు జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర మూడో రోజు అనురాగం ఆత్మీయతలతో సాగింది. నకిరేకల్ నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరిన షర్మిల మర్రూర్, తిప్పర్తి మీదుగా ఇందుగుల గ్రామానికి వెళ్లారు. ఇందుగుల గ్రామంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. గ్రామ పొలిమేరల నుంచే డప్పు చప్పుళ్లతో ఆమెకు స్వాగతం పలికారు. ఇందుగుల సెంటర్లో మహిళలు కొలాట చప్పుళ్లు చేస్తూ షర్మిలను పరామర్శ కుటుంబం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రాయించు నర్సింహ కుటుంబ సభ్యులను కలిసిన షర్మిల వారికి మనోధైర్యం చెప్పారు. అందరికీ మంచిరోజులు వస్తాయని ధైర్యంగా ఉండాలని సూచించారు. అదే గ్రామంలో కరుణాకర్‌రెడ్డి (గతంలో వైఎస్సార్ ఈ గ్రామానికి వచ్చినప్పుడు కరుణాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుమారుడికి రాజశేఖరరెడ్డి అని నామకరణం చేశారు) ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. తన తండ్రి పేరు పెట్టిన రాజశేఖరరెడ్డిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి కుటుంబం షర్మిలకు చీరను బహూకరించారు. అక్కడి నుంచి ఆమె తిప్పర్తి మండల కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యంలో సిలార్మియాగూడెంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పులమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిప్పర్తి మండల కేంద్రంలో గుంటి వెంకటేశం కుటుంబ సభ్యులను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారు నివసిస్తున్న ఇల్లు కులిపోవడంతో ఆరుబయట వెసిన టెంట్లోనే వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిలకు వారు గాజులు, పండ్లు, జాకెట్లు బహూకరించారు. గుంటి వెంకటేశం కుటుంబానికి ధైర్యం చెప్పిన షర్మిల అక్కడి నుంచి నల్లగొండ రూరల్ మండలంలోని చందనపల్లికి వెళ్లారు. చందనపల్లిలో షర్మిలకు ఘనస్వాగతం లభించింది. గ్రామ శివారు నుంచే షర్మిలను పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి డప్పుచప్పుళ్లతో తోడ్కొని వెళ్లారు. భిక్షమయ్య ఇల్లు రేకుల ఇల్లు కాడవం, కరెంట్ లేకపోవడంతో షర్మిలకు చెమటలు వస్తున్నాయి. అది గమనించిన భిక్షమయ్య కోడలు టవల్ తీసుకుని ప్రేమతో షర్మిలకు చెమటలు పోయకుండా చూసుకున్నారు. అది గమనించిన షర్మిల వద్దని వారించారు. గ్రామ సర్పంచ్ భర్త భిక్షం మాట్లాడుతూ వైఎస్సార్ ఈ ఊరికి దేవుడని ముంపుకు గురైన తమ గ్రామానికి రూ. 26 కోట్లు మంజూరు చేసి అన్ని సౌకర్యాలు సమకూర్చారని చెప్పారు. మరో స్థానికుడు మాట్లాడుతూ మా గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తే ఆయనను స్మరించుకుంటామని షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. భిక్షమయ్య కుటుంబ సభ్యులు తెచ్చిన స్వీట్లు తిన్న షర్మిల అక్కడి నుంచి నల్లగొండ పట్టణానికి బయలుదేరారు. మార్గ మధ్యంలో ఖాజీరామారం గ్రామం వద్ద మధ్యాహ్న భోజనం చేసిన ఆమె నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిమెంట్ రోడ్డులో పాండేకర్ దయానంద్ కుటుంబాన్ని కలిసారు.దయానంద్ ముగ్గురు పిల్లలు ఏం చదువుతున్నారని విషయాన్ని అడిగి తెలుసుకున్న షర్మిల వారిని బాగా చదువుకోవాలని సూచించారు. దయానంద్ భార్య నర్సూబాయ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిన రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. రాజశేఖరరెడ్డి కూతురు మా ఇంటికి రావడమే.. అంటూ షర్మిల చేతిలో చెయ్యి వేసి విలపించారు. దయానంద్ కుటుంబ సభ్యులు ప్రేమతో ఇచ్చిన కొబ్బరిబొండాను తాగిన షర్మిల అక్కడి నుంచి నాంపల్లి బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యంలో కనగల్ సెంటర్లో వైఎస్ విగ్రహానికి వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాంపల్లి వెళ్లిన షర్మిల అక్కడ అస్తర్బీ కుటుంబ సభ్యులను కలిసారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబంలోని మూగ వ్యక్తుల గురించి సాక్షి పత్రికలో ప్రచురితమైన మానవాసక్తికర కథనాన్ని షర్మిలకు చూయించారు. అక్కడ షర్మిల అస్తర్ బీ మనుమళ్లతో కాసేపు ముచ్చిటించారు. 8వ తరగతి చదువుతున్న అల్తాఫ్ అనే విద్యార్థిని నువ్వేం చదువుకుంటావ్ అని ప్రశ్నించగా అతను పోలీస్‌ను అవుతానని చెప్పడంతో షర్మిల నవ్వులు చిందించారు. పరామర్శ అనంతరం అస్తర్బీ కుటుంబం ఎదుట పెద్ద ఎత్తున గూమిగూడిన ప్రజలను వర్షంలోనే తడుస్తూ పలుకరించారు. షర్మిలతో కరచాలనం చేసేందుకు వర్షంలోనూ స్థానికులు పోటీపడ్డారు. అక్కడ నుంచి ఆమె మర్రిగూడ మండలం తానేదార్పల్లి గ్రామానికి వెళ్లి మునగాల పుల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. మార్గమధ్యంలో నూతన వధూవరులను కలిసి ఆశీర్వదించారు. తానేదార్పలిల్లో పుల్లమ్మ మనువడు, మనువరాళ్లను బాగా చదువుకోవాలని, కుటుంబానికి ఉపయోగపడేలా స్థిరపడాలని సూచించారు. పరామర్శ జరుగుతున్న ఇంటి వద్ద గూమికూడిన ప్రజలను పలుకరించి చౌటుప్పల్‌లోని అన్నా మెమోరియల్ పాఠశాలకు వెళ్లి రాత్రి బసచేశారు. ఎన్టీఆర్.. ఆ తర్వాత వైఎస్ తానేదార్‌పల్లిలో పరామర్శను ముగించుకుని బయటకు వచ్చిన షర్మిలను బండి జంగమ్మ అనే వృద్ధురాలు పలకరించారు. తాను కూడా రాజకీయాలు చేశానని చెప్పిన ఆమె ఇప్పటి రాజకీయాలపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎవరూ పేదల గురించి పట్టించుకోవడం లేదని, కార్లలో తిరుగుతున్న వారికే పనులవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్సార్‌లే పేదలకు న్యాయం చేశారని షర్మిలకు చెప్పారు. షర్మిల వెంట రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు డాక్టర్. గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె. శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, ఎడ్మ కృష్ణారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, సేవాదళం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ ముజ్తబా అహ్మద్, రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ పి. సిద్దార్థరెడ్డి, పార్టీ రాష్ర్ట కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఇరుగుసునీల్కుమార్, పిట్ట రాంరెడ్డి, ఎం.డి.సలీం, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా, యువజన విభాగం అధ్యక్షుడు పచ్చిపాల వేణుయాదవ్, మేడిశెట్టి యాదయ్య తదితరులున్నారు. -
మూడోరోజు షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్: వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర మూడోరోజూ నల్గొండ జిల్లాలో కొనసాగింది. జిల్లాలో మొత్తం ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. నల్లగొండ, మునుగోడు నియోజక వర్గాల్లో యాత్ర సాగించారు. తిప్పర్తి మండలం కేంద్రానికి చెందిన గుంటి వెంకటేశం కుటుంబం, అదే మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రాయించు నర్సింహ కుంటుంబాన్ని పరామర్శించారు. అదే విధంగా జిల్లాలోని చందనపల్లి గ్రామానికి చెందిన చింతా భిక్షమయ్య కుటుంబం, నల్లగొండ పట్టణంలోని దండేకార్ దయానంద్ కుటుంబం, మర్రిగూడెం మండలం తాన్ దార్ పల్లి గ్రామానికి చెందిన మునగాల పుల్లమ్మ కుటుంబం, నాంపల్లికి చెందిన అస్తర్ బీ, చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన బిట్ర వసంతరావు కుంటుంబాన్ని పరామర్శించారు. -
9 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
* నల్లగొండ జిల్లాలో 17 కుటుంబాలకు పరామర్శ * 509 కిలోమీటర్ల మేర యాత్ర * వైఎస్సార్సీపీ నేత శివకుమార్ సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన సోదరి షర్మిల రెండో విడత పరామర్శ యాత్రను ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ బుధవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. 9న భువనగిరి నియోజకవర్గం బీబీనగర్‌లో యాత్ర ప్రారంభమై.. 12న మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌లో ముగుస్తుందని చెప్పారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 509 కి.మీ. మేర యాత్ర సాగుతుందన్నారు. 17 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారన్నారు. మహానేత వైఎస్సార్ మరణం తట్టుకోలేక నల్లగొండ జిల్లాలో 49 మంది చనిపోయారని, అందులో 32 కుటుంబాలను గతంలోనే ఆమె పరామర్శించారని చెప్పారు. తాజా యాత్ర రోడ్‌మ్యాప్ పూర్తయిందన్నారు. పార్టీ యంత్రాంగంతోపాటు ప్రజలందరూ ఈ యాత్రలో పాల్గొనాలని కోరారు. త్వరలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కూడా పరామర్శ యాత్ర ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముజ్తబా అహ్మద్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్ పాల్గొన్నారు. -
9 నుంచి వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర