
మూడోరోజు షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్: వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర మూడోరోజూ నల్గొండ జిల్లాలో కొనసాగింది. జిల్లాలో మొత్తం ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. నల్లగొండ, మునుగోడు నియోజక వర్గాల్లో యాత్ర సాగించారు. తిప్పర్తి మండలం కేంద్రానికి చెందిన గుంటి వెంకటేశం కుటుంబం, అదే మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రాయించు నర్సింహ కుంటుంబాన్ని పరామర్శించారు.
అదే విధంగా జిల్లాలోని చందనపల్లి గ్రామానికి చెందిన చింతా భిక్షమయ్య కుటుంబం, నల్లగొండ పట్టణంలోని దండేకార్ దయానంద్ కుటుంబం, మర్రిగూడెం మండలం తాన్ దార్ పల్లి గ్రామానికి చెందిన మునగాల పుల్లమ్మ కుటుంబం, నాంపల్లికి చెందిన అస్తర్ బీ, చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన బిట్ర వసంతరావు కుంటుంబాన్ని పరామర్శించారు.