నిద్రిస్తున్న యువతి వీడియో తీసిన డ్రైవర్ | she team nab cab driver at hitech city | Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్న యువతి వీడియో తీసిన డ్రైవర్

Published Tue, Jan 20 2015 6:49 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

నిద్రిస్తున్న యువతి వీడియో తీసిన డ్రైవర్

నిద్రిస్తున్న యువతి వీడియో తీసిన డ్రైవర్

హైదరాబాద్: హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ ను 'షీ' టీమ్ అదుపులోకి తీసుకుంది. కారులో నిద్రిస్తున్న యువతిని అభ్యంతకరంగా సెల్ ఫోన్ లో వీడియో తీసినందుకు అతడిని పట్టుకున్నారు. అనుమానంగా వెళుతున్న అతడిని 'షీ' టీమ్ పట్టుకోవడంతో ఈ విషయం వెలుగు చూసింది.

అతడి వద్ద నుంచి 8 నిమిషాల నిడివి గల వీడియో ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రషీద్ గా గుర్తించారు. అతడిని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ లో మహిళల భద్రత కోసం నగర పోలీసులు 'షీ' టీమ్‌లను రంగంలోకి దించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement