Sanjjanaa Galrani: Ola Cab Driver Complaint Against Sanjana Galrani - Sakshi
Sakshi News home page

Sanjjanaa Galrani: నటి సంజన వీరంగం..! 

Published Wed, Oct 6 2021 6:27 AM | Last Updated on Wed, Oct 6 2021 8:27 AM

Ola Cab Driver Complaint Against Sanjana Galrani - Sakshi

యశవంతపుర: డ్రగ్స్‌ వినియోగం– రవాణా కేసులో జైలు పాలై... మళ్లీ విడుదలైన నటి సంజన గల్రాని ఈసారి ఓలా క్యాబ్‌ డ్రైవర్‌తో గొడవ పడ్డారు. మంగళవారం ఉదయం షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లడానికి  బెంగళూరులోని ఇందిరానగర నుంచి రాజరాజేశ్వరినగరకు ఆమె క్యాబ్‌ బుక్‌ చేశారు.

క్యాబ్‌లోకి ఎక్కిన తరువాత గమ్యం మార్చాలని డ్రైవర్‌ సుసయ్‌ మణికి సూచించగా, అతడు కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి అడిగాడు. అయితే లొకేషన్‌ను మార్చలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సంజన నానాతిట్లు తిడుతూ తనతో గొడవ పెట్టుకుందని డ్రైవర్‌ ఆరోపించాడు. గొడవను వీడియో తీశాడు. ఆమెపై రాజరాజేశ్వరినగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

చదవండి: (తండ్రిని చూసి గుక్కపెట్టి ఏడ్చిన ఆర్యన్‌ ఖాన్‌)

తాను చెప్పిన చోటుకు తీసుకెళ్లలేదని సంజన ట్విట్టర్లో ఆరోపించారు. క్యాబ్‌లో ఏసీని పెంచాలని అడిగితే నిర్లక్ష్యంగా బదులిచ్చాడని, కారు డోర్‌ కూడా సరిగాలేదని చెప్పారు. అడిగినంత డబ్బులు ఇచ్చి కూడా ఇటువంటి డబ్బా కారులో వెళ్లాలా అని ఓలాపై మండిపడ్డారు. కారులో ఉండగానే ఆమె డయల్‌ 100కు ఫోన్‌ చేసి డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement