SanjjanaaGalrani
-
కరోనా తర్వాత నాకు ఈ సినిమా ఆఫర్ వచ్చింది: సంజనా
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే, చాణక్య ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “మణిశంకర్”.ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి.వి.కె(జి. వెంకట్ కృష్టణ్) అందించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ.. 'ఒక సంఘటన చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతుంది. ఇందులో ఓ ఫిలాసఫీ కూడా ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారు. చాలా త్వరగానే సినిమాను పూర్తి చేశాం. అనుకున్న బడ్జెట్‌లోపే సినిమాను అద్భుతంగా నిర్మించాం. నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో సినిమాను నిర్మించాను. ఇళయరాజా శిష్యుడు ఎం ఎల్ రాజా మా సినిమాకు సంగీతం అందించాడు' అన్నారు. డైరెక్టర్ జి. వెంకట్ కృష్టణ్ మాట్లాడుతూ.. 'సినిమా కోసం అందరూ కష్టపడి పని చేశారు. ఇదే టీంతో మళ్లీ ఇంకో సినిమా చేస్తున్నా. జనవరి మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి' అన్నారు. సంజన గల్రానీ మాట్లాడుతూ.. 'కరోనా తరువాత నాకు ఈ ఆఫర్ వచ్చింది. శివ కంఠమనేని, బాబి గారికి థాంక్స్. శివ కంఠమనేని గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలు చాలా మంచి వారు. చక్కటి ప్లానింగ్‌తో సినిమాను నిర్మించారు' అన్నారు. చదవండి: షూటింగ్‌కు అస్వస్థతకు లోనైన కన్నడ స్టార్ ఓటీటీలో నవీన్ చంద్ర రిపీట్ -
నటి సంజన వీరంగం..!
యశవంతపుర: డ్రగ్స్ వినియోగం– రవాణా కేసులో జైలు పాలై... మళ్లీ విడుదలైన నటి సంజన గల్రాని ఈసారి ఓలా క్యాబ్ డ్రైవర్‌తో గొడవ పడ్డారు. మంగళవారం ఉదయం షూటింగ్ స్పాట్‌కు వెళ్లడానికి బెంగళూరులోని ఇందిరానగర నుంచి రాజరాజేశ్వరినగరకు ఆమె క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్లోకి ఎక్కిన తరువాత గమ్యం మార్చాలని డ్రైవర్ సుసయ్ మణికి సూచించగా, అతడు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి అడిగాడు. అయితే లొకేషన్‌ను మార్చలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సంజన నానాతిట్లు తిడుతూ తనతో గొడవ పెట్టుకుందని డ్రైవర్ ఆరోపించాడు. గొడవను వీడియో తీశాడు. ఆమెపై రాజరాజేశ్వరినగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: (తండ్రిని చూసి గుక్కపెట్టి ఏడ్చిన ఆర్యన్ ఖాన్) తాను చెప్పిన చోటుకు తీసుకెళ్లలేదని సంజన ట్విట్టర్లో ఆరోపించారు. క్యాబ్‌లో ఏసీని పెంచాలని అడిగితే నిర్లక్ష్యంగా బదులిచ్చాడని, కారు డోర్ కూడా సరిగాలేదని చెప్పారు. అడిగినంత డబ్బులు ఇచ్చి కూడా ఇటువంటి డబ్బా కారులో వెళ్లాలా అని ఓలాపై మండిపడ్డారు. కారులో ఉండగానే ఆమె డయల్ 100కు ఫోన్ చేసి డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. Car number Ka 50 - 8960 @olamoney_in @Olacabs @Ola_Bangalore , we are Harrassed early morning by this driver named Susay mani s , Not increasing the A/c from speed level one , We are 4 people in car he is suffocating us . Full story in pic below pic.twitter.com/ivxwgeB7LL — Sanjjanaa Galrani (@sanjjanagalrani) October 5, 2021 -
డ్రగ్స్ కేసు: తెరపైకి ప్రముఖుల పేర్లు..
యశవంతపుర: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల బెయిల్ పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు ఆవరణలోని 33వ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు శనివారం విచారించింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాల నమోదుకు రెండురోజులు గడువు కోరడంతో జడ్జి విచారణను 21వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు. దీంతో నటీమణులకు నిరాశ ఎదురైంది. డ్రగ్స్ విక్రేతలతో నటులకు లింక్ ఉందని, బెయిలును మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీసీబీ తరఫు న్యాయవాది వాదించారు. రాగిణి, సంజనల సన్నిహితులు రవిశంకర్, రాహుల్‌తో పాటు మరో ఇద్దరి బెయిల్ పిటిషన్లు కూడా సోమవారం కోర్టు ముందుకు వస్తాయి. సీసీబీ విచారణకు ఆ ముగ్గురు డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్, నటుడు అకుల్ బాలాజీ, నటుడు సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే దేవరాజ్ కొడుకు యువరాజ్లు శనివారం సీసీబీ విచారణకు హాజరయ్యారు. వీరు సీసీబీ ఆఫీసులోకి వస్తుండగానే మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు డ్రగ్స్ పార్టీలలో పాల్గొని మత్తు పదార్థాలను సేవిస్తున్నారా, పార్టీల నిర్వాహకులు ఎవరు, డ్రగ్స్‌ను ఎవరు సప్లై చేసేవారు తదితర కోణాల్లో ప్రశ్నించారు. ఎన్ని ఏళ్లు నుంచి డ్రగ్స్ పారీ్టలకు వెళ్తున్నారు అని ప్రశ్నించారు. ఎక్కడెక్కడ పారీ్టలను ఏర్పాటు చేసేవారో ఆరా తీశారు. యాంకర్ అకుల్ బాలాజీకి ముఖ్య నిందితుడు వీరేన్ ఖన్నా ఎన్నేళ్ల నుంచి పరిచయం. మీ ఫాం హౌస్‌ను ఎన్నికాలం వరకు లీజుకు ఇచ్చారు అని అకుల్‌ను ప్రశ్నించారు. ప్రముఖులతో జాబితా డ్రగ్స్ కేసులో పెద్ద పెద్ద అధికారుల పుత్రులు, స్టార్ నటులు, ప్రైవేట్ టీవీ చానల్స్‌కు చెందిన యాంకర్ల పేరు బయటకు వస్తున్నాయి. వీరేన్‌ఖన్నా తనకు పరిచయమైన వారందరి పేర్లను సీసీబీకి వివరించినట్లు తెలిసింది. విలాసంతమైన హోటల్స్, పబ్, అపార్ట్మెంట్లలో జరిగే విందు వినోదాల్లో పోలీసు అధికారు, యాంకర్లు, రాజకీయ నాయకుల తనయులు పాల్గొనేవారి జాబితాను సీసీబీ సిద్ధం చేసింది. వారికి కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్‌పంత్ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. -
ఉపేంద్ర 'ఐ లవ్ యూ' టీజర్ విడుదల
-
హీరోయిన్ సంజనా ర్యాంప్ వాక్