Sanjana Galrani Mani Shankar Movie Ready For Release - Sakshi
Sakshi News home page

Mani Shankar: రిలీజ్‌కు రెడీ అవుతున్న సంజనా గల్రానీ 'మణిశంకర్‌'

Published Thu, Nov 24 2022 8:24 PM | Last Updated on Thu, Nov 24 2022 9:27 PM

Sanjana Galrani Mani Shankar Movie Ready For Release - Sakshi

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న చిత్రం “మణిశంకర్”.ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి.వి.కె(జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌) అందించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా చిత్రయూనిట్‌ మీడియా ముందుకు వచ్చింది.

హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ.. 'ఒక సంఘటన చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతుంది. ఇందులో ఓ ఫిలాసఫీ కూడా ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారు. చాలా త్వరగానే సినిమాను పూర్తి చేశాం. అనుకున్న బడ్జెట్‌లోపే సినిమాను అద్భుతంగా నిర్మించాం. నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో సినిమాను నిర్మించాను. ఇళయరాజా శిష్యుడు ఎం ఎల్ రాజా మా సినిమాకు సంగీతం అందించాడు' అన్నారు.

డైరెక్టర్ జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌ మాట్లాడుతూ.. 'సినిమా కోసం అందరూ కష్టపడి పని చేశారు. ఇదే టీంతో మళ్లీ ఇంకో సినిమా చేస్తున్నా. జనవరి మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి' అన్నారు. సంజన గల్రానీ మాట్లాడుతూ.. 'కరోనా తరువాత నాకు ఈ ఆఫర్ వచ్చింది. శివ కంఠమనేని, బాబి గారికి థాంక్స్. శివ కంఠమనేని గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలు చాలా మంచి వారు. చక్కటి ప్లానింగ్‌తో సినిమాను నిర్మించారు' అన్నారు.

చదవండి: షూటింగ్‌కు అస్వస్థతకు లోనైన కన్నడ స్టార్‌
ఓటీటీలో నవీన్‌ చంద్ర రిపీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement