హైదరాబాద్: సింగరేణిలోని రామగుండం ఏరియాలో ప్రతిష్టాత్మకమైన ఆడ్రియాల లాంగ్‌వాల్ భూగర్భగనిలో ఉత్పిత్తిపై సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆడ్రియాల లాంగ్‌వాల్ గనిలో నిలకడైన పనితీరుతో, రోజువారీ లక్ష్యాలను సాధిస్తూ.. ఉత్పత్తి పెంచాలని అధికారులను, లాంగ్‌వాల్ పరికరాల సరఫరా సంస్థ ఎం/ఎస్ కాటర్‌పిల్లర్ ప్రతినిధులు వోల్ఫ్‌గాంగ్ రోజర్‌ను, మన్వీందర్‌సింగ్ భరత్ తదితరులను ఆదేశించారు. ఆసియాలోనే పెద్దదిగా భావిస్తున్న ఈ గని నుంచి ఈ ఏడాది 25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో సంస్థ డెరైక్టర్లు బి.రమేశ్‌కుమార్, పి.రమేశ్‌బాబు, సీజీఎం అమర్‌నాథ్ పాల్గొన్నారు.